తమిళనాడులో అసాధారణ పరిస్థితి

16 Jan, 2017 03:29 IST|Sakshi
తమిళనాడులో అసాధారణ పరిస్థితి

తమిళసినిమా: జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఇటీవల ఆయన అభిమానులు పెద్దఎత్తున పోస్టర్లు ముద్రించి చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మరోవైపు రజనీకాంత్‌ కోసం పలు రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత తమిళనాడు పరిస్థితి గురించి రజనీకాంత్‌ వ్యాఖ్యలు మేధావులను సైతం ఆలోచనలో పడేశాయి. కాగా ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న  రజనీకాంత్‌ ఏమన్నారో చూద్దాం.

పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందే. ఇవీ సూపర్‌స్టార్‌ వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యల్లో నిగూడార్ధం ఏమిటి గురువా? అంటూ విశ్లేషించే పనిలో పడ్డారు కొందరు రాజకీయవాదులు.

>
మరిన్ని వార్తలు