సిద్ధమేనా..?

7 Mar, 2014 23:41 IST|Sakshi
సిద్ధమేనా..?

 ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్‌కు సుప్రీం ప్రశ్న
 రాజధానిలో ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన విధింపు ప్రజాస్వామ్య వ్యవస్థకే హానికరమంటూ అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడింది.
 
 సాక్షి, న్యూఢిల్లీ :దేశరాజధానిలో ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆసక్తి ఉందో లేదో తెలియచేయాలంటూ సుప్రీంకోర్టు కాంగ్రెస్, బీజేపీకి శుక్రవా రం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేతులు కలిపే అవకాశముంటే చెప్పాలని న్యాయస్థానం రెండు పార్టీలను కోరింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించి, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌పై ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసిం ది. ఏడాదిపాటు అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉం చడం ప్రజాస్వామ్యానికి హానికరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
 
  కేసుపై తదుపరి  విచారణ మార్చి 31న జరుగనుంది. శాసనసభలో ప్రస్తుతమున్న శాసనసభ్యులు పార్టీలు మారడం వల్ల బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కేంద్రం తెలియజేయడంతో న్యాయస్థానం బీజేపీ, కాంగ్రెస్‌కు నోటీసు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడానికే అసెం బ్లీని సుప్తచేతనావస్థలో ఉంచినట్లు ఆప్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీని రద్దు చేస్తే వెంటనే ఎన్నికలు జరిపించాల్సి ఉంటుందని, సుప్తచేతనావస్థలో ఉం చడం వల్ల దానిని ఏడాదిపాటు అలాగే కొనసాగిం చవచ్చని తెలిపింది. ఏడాదిపాటు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటయ్యే వీలు ఉండబోదని ఆప్ పిటిషన్ పేర్కొంది.  
 
 ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉందని కేంద్రం కోర్టు కు గురువారం తెలిపిందని ఆప్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. పార్టీల మార్పిడిని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారా? అని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు ఆయ న చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అటార్నీ జనరల్ తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దానితో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ తెలియజేయాలని  నోటీసు జారీ చేసిందని భూషణ్ తెలిపారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం బీజేపీ, కాం గ్రెస్ ఒక్కటయ్యాయని, ప్రభుత్వ ఏర్పాటుకు కూడా రెండు పార్టీలు ఏకం కావ చ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.  శత్రుపక్షాలే అయినా, రెండు పార్టీలు ఒకటి కావచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, నేటి శత్రువు రేపు మంచి మిత్రుడు కావచ్చని బెంచ్ వ్యాఖ్యానించింది.
 
 మా నిర్ణయం మంచిదే : కేంద్ర ప్రభుత్వం
 అసెంబ్లీని  రద్దుచేయకుండా సుప్తచేతనావస్థలో ఉం చడం సమర్థనీయమేనని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ముందుకు వచ్చే అవకాశం ఉండడం, ప్రజాప్రయోజనాల దృష్ట్యా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని నిర్ణయించినట్లు కేంద్రం అఫిడవిట్‌లో తెలిపిం ది. ‘ఆప్ ఎమ్మెల్యే బిన్నీ ఇప్పటికే పార్టీ వీడారు. మరికొందరు అసంతృప్త ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో చేతులు కలపవచ్చని వార్తలు వస్తున్నా యి. షౌకీన్ వంటి స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఆప్‌కు మద్దతు ఉపసహరించుకున్నారు. వీరందరితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది’ అని అటార్నీ జనరల్ వాహనవతి సుప్రీంకోర్టుకు విన్నవించారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా స్వల్పవ్యవధిలోనే అసెంబ్లీ రద్దు చేయడం మంచిది కాద ని లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయపడ్డట్టు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి  తెలిపింది.

మరిన్ని వార్తలు