బాల నేరస్థుల చట్టంలో మార్పులకు సుప్రీం నో

17 Jul, 2013 14:37 IST|Sakshi
బాల నేరస్థుల చట్టంలో మార్పులకు సుప్రీం నో

న్యూఢిల్లీ: బాల నేరస్థుల చట్టంలో మార్పులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాలనేరస్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జువైనల్ చట్టంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆ చట్టంలో ఉన్న నిబంధనలను సమర్థించింది. 18 ఏళ్ల కంటె తక్కువ వయసున్న నేరస్థులను జువైనల్‌ హోంలోనే ఉంచాలని, వారి విచారణను జువైనల్ బోర్డు చూసుకుంటుందని స్పష్టం చేసింది.

క్రూరమైన నేరాలకు పాల్పడిన బాలలు ఈ చట్టం కింద తప్పించుకోలేరని చీఫ్ జస్టిస్ అల్తమస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 16 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ బాలుడు నిందితుడిగా ఉండడంతో బాలనేరస్థుల వయోపరిమితిని తగ్గించాలని దాఖలైన పిల్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు