సూర్య హై క్యూ

10 May, 2015 03:07 IST|Sakshi
సూర్య హై క్యూ

సూపర్ పవర్ కిడ్స్‌తో తెరపై వండర్స్ సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు నటుడు సూర్య. ఈయన తన 2డీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం హై క్యూ. అమలాపాల్, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు బాలతారలు హీరోలుగా నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి వివరాలు వెలికి రాకపోవడంతో అసలు కథేంటన్న ఆసక్తి చాలామంది లో ఉంది. అయితే ఇప్పుడీ చిత్రం గురించి కొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి.
 
 ఇది సూపర్ పవర్ గల ముగ్గురు పిల్లల ఇతివృత్తంతో రూపొం దుతున్న చిత్రం అని తెలిసింది. ఆ పిల్లలను ఈ సమాజం ఎలా చూస్తుంది? ఆ సమాజం నుంచి సూపర్ పవర్ కిడ్స్ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంటారు? ఇత్యాది పలు ఆసక్తికరమైన అంశాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం హైక్యూ.  ఈ సూపర్ పవర్ కిడ్స్ గురించి పరిశోధన చేసే తమిళ్‌నాడాన్ పాత్రలో సూర్య నటిస్తున్నారట. నటి అమలాపాల్ టీచర్‌గా,బిందుమాధవి ఈ సూపర్ కిడ్స్‌లో ఒక కిడ్ తల్లిగా నటిస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు