కరోనా కట్టడికి నిత్యానంద పచ్చైపత్తిని వ్రతం

18 Mar, 2020 13:21 IST|Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం: తానే దేవుడని, పరమశివుడని ఏవేవో గొప్పలు చెప్పుకునే వివాదాస్పద స్వామి నిత్యానంద కరోనా వైరస్‌ను వ్రతం ద్వారా నయం చేస్తానని ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద అరెస్టుకు భయపడి పరారై గుర్తుతెలియని చోట ఉన్నారు. అక్కడి నుండి సోమవారం సాయంత్రం ఆయన రామనగర బిడదిలోని తన ఆశ్రమానికి ఈ మెయిల్‌లో వీడియో పంపాడు.

దాని సారాంశం ప్రకారం.. శిష్యులు కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు, కరోనా నివారణకు తాను ధ్యానం,ఉవాసం, పచ్చైపత్తిని వ్రతం ప్రారంభించాను. బిడది ఆశ్రమంలో కూడా శిష్యులు పచ్చై పత్తిని వ్రతం ఆచరించాలి, ధ్యానం సమయంలో ఓం నిత్యానంద పరమ శివోహం అనని జపించాలి. వ్రతంతో పాటు వైద్యులు సూచించిన మందులను సేవించాలి అని వివరించాడు. దీంతో బిడదిలో శిష్యులు పచ్చైపత్తిని వ్రతానికి ఏర్పాట్లు ప్రారంభించారు.  చదవండి: ‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’ 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా