పోటాపోటీగా ‘స్వచ్ఛ్ విద్యాలయ్’

28 Sep, 2014 22:05 IST|Sakshi

గాంధీ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ భారత్.. స్వచ్ఛ్ విద్యాలయ్’ ప్రారంభం

సాక్షి, ముంబై : నగరంలోని పలు పాఠశాలలు కేవలం విద్య లో మాత్రమే గ్రేడ్ సంపాదించడమేకాకుండా తమ పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచి గ్రేడ్ సాధించేందుకు పోటీ పడనున్నారు. ఇందుకు గాను ఆయా పాఠశాలలకు నగదు బహుమతి కూడా లభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘స్వచ్ఛ్ భారత్..స్వచ్ఛ్ విద్యాలయ’ అనే ప్రచారాన్ని మానవ వనరుల అభివృద్ధి మం త్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరిశుభ్రత పాటించిన పాఠశాలలకు రివార్డులను అందించనుంది.
 
పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారో వారికి గ్రేడుల వారీగా రేటింగ్‌ను ప్రకటించి నగదు బహుమతిని అందించనుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా పాఠశాలలు తమ పాఠశాలలో పారిశుధ్యానికి సంబంధించి స్థితిగతులను అక్టోబర్ 31వ తేదీవరకు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువగా స్కోర్ చేసిన పాఠశాలలకు ‘గ్రీన్ రేటింగ్’ ఇవ్వనున్నారు. అదేవిధంగా నగదు బహుమతిగా రూ.లక్ష ఇవ్వనున్నారు. అలాగే ‘బ్లూ రేటింగ్’ సాధించిన పాఠశాలలకు రూ.75 వేలు, ‘యెల్లో రేటింగ్’ వచ్చి న పాఠశాలలకు రూ.25 వేలు అందించనున్నారు.
 
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించనుంది. ఈ జీవో ను  సీబీఎస్‌ఈ తనకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రణాళిక రచించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలతోపాటు విద్యార్థులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేసేందుకు నిర్ణయించింది. పాఠశాల తరగతి గదులు, టాయిలెట్లు, లేబరేటరీలు, ఆట మైదానాలు, వంట గదులను శుభ్రంగా ఉంచడంలో వీరందరూ కృషిచేస్తారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అన్ని సీబీఎస్‌ఈ పాఠశాల లే కాకుండా ఇతర బోర్డులు కూడా పాల్గొననున్నాయి. ఇందుకు సంబంధించి తాము ఓ ప్రణాళికను కూడా రూపొందించామని అంధేరీకి చెందిన సీబీ ఎస్‌ఈ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రి య ద్వారా చాలా మంది విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని మరో ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా పరిశుభ్రత విలువ తెలుస్తుందని తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా