బిల్లు కట్టకుండానే ‘టోల్‌’ దాటవచ్చు

27 Jul, 2018 09:04 IST|Sakshi

కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన సిండికేట్‌ బ్యాంక్‌

సాక్షి బెంగళూరు: ఇక నుంచి టోల్‌ ప్లాజాల్లో వాహనదారులు బిల్లు కట్టేందుకు ఆగాల్సిన పని లేదు. ఈమేరకు  నేషనల్‌ పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), సిండికేట్‌ బ్యాంక్‌ సంయుక్తంగా కొత్త పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాయి. వాహనదారులు   ముందుగానే ప్రీపెయిడ్‌కు సంబంధించిన చిప్‌లు కొనుగోలు చేసి వాటిని సిండికేట్‌ బ్యాంకు ఖాతా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ చిప్‌ను  వాహనాల అద్దానికి బిగించి ఉండాలి. 

రేడియో ఫౌనఃపున్యం ద్వారా ఆ వాహనాలు టోల్‌ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్లిపోవచ్చు. అదేవిధంగా ఖాతా నుంచి నేరుగా ఆ చిప్‌కు రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఈ సదుపాయం అన్ని సిండికేట్‌ బ్యాంకుల్లో అందుబాటులో ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు.  త్వరలోనే అన్ని బ్యాంకుల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు