సూదిమందుశాపమవుతోంది

30 Nov, 2013 23:12 IST|Sakshi
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య కాస్తలో కాస్త తగ్గుముఖం పడుతున్నా ఈ రోగంబారిన పడుతున్నవారిలో ఎక్కువ మందికి సూదిమందు ద్వారానే ఈ మహమ్మారి వ్యాపిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) తెలిపిన తాజా వివరాల ప్రకారం... దేశంలోని సాధారణ పౌరుల్లో 0.40 శాతం మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిబారిన పడుతున్నవారిలో 7.17 మందికి సూదిమందు ద్వారానే ఈ వ్యాధి సోకినట్లు తేలింది. భారత్ వంటి దేశాల్లో సూదిమందుపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యలకు సూదిమందే పరిష్కారం కాకపోయినప్పటికీ వైద్యు ల అత్యుత్సాహం సూదిమందు సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. 
 
 రోగుల్లో కూడా సూదిమందు వేసుకుంటేనే తమ జబ్బు నయమవుతుందన్న ఓ అపోహ బలంగా నెల కొంది. ఇదే ఎయిడ్స్ వంటి మహమ్మారి విస్తరించడానికి కారణమవుతోంది. ‘హృదయ’ ప్రాజెక్టు అధికారి ఫ్రాన్సి స్ జోసెఫ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘భారతదేశం లో మత్తుపదార్థాల, హానికర మందుల నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావడంలేదు. ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పోలీసులు నిష్క్రియగా ఉంటున్నారు. పోలీసులకు ఈ చట్టంపై అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమవుతోంది. సూదిమందు సం స్కృతిపై ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని ఈ చట్టం నొక్కి చెబుతున్నా ఎవరూ పాటించడంలేదు. ఈ చట్టాన్ని మరింతకఠినంగా మార్చాల్సిన అవసరముంది. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు విధించడంతోపాటు క్రిమినల్ కేసులను నమోదు చేసి, జైలుకు పంపాల్సిన అవసరముంది. ఇందుకోసం పోలీ సులకు కూడా కొంత స్వేచ్ఛనివ్వాల్సి ఉంది. అంతేకాక సూదిమందు వినియోగంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించినప్పుడే ఎయిడ్స్ నియంత్రణ చర్యలు సత్ఫలితాలనిస్తాయ’న్నారు.
 
 శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే...
 వ్యాధిబారిన పడిన బాధితులకు రక్షణ కల్పించే హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బిల్లును ఈ నెల 5 నుంచి 20 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురావాల్సిందేనని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 2006లోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనలకు తుదిరూపు తెచ్చిందని, అయినప్పటికీ ఇంకా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈ శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు తెచ్చి హెచ్‌ఐవీ రోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. బిల్లు కార్యరూపం దాలిస్తే హెచ్‌ఐవీ సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం బాధితులకు ఉపాధి దొరకడమే కష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రభుత్వమే ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఢిల్లీ నెట్‌వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ ప్రతినిధి హరి శంకర్ మాట్లాడుతూ... ‘బిల్లు పార్లమెంటు ముందుకు రావడంలో జరుగుతున్న జాప్యం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఈ ప్రభుత్వం బిల్లు విషయంలో ఏమాత్రం చొరవ చూపడంలేద’న్నారు. 
 
మరిన్ని వార్తలు