వ్యభిచారం కేసులో ఇరికించేందుకు కుట్ర : నటి

24 Aug, 2016 01:05 IST|Sakshi
వ్యభిచారం కేసులో ఇరికించేందుకు కుట్ర : నటి

 తమిళసినిమా: నన్ను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించడానికి నా మాజీ భర్త కుట్ర పన్నుతున్నాడని నటి రాధ ఆరోపించారు. సుందరా ట్రావెల్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరో సారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు. తాను నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు. అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు.
 
  కాగా తన తల్లి సైదాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి ఐదు లక్షలు అప్పు ఇచ్చారని,అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. తాను వెళ్లి అడగ్గా సరిగా సమాధానం చెప్పకుండా దుర్భాషలాడాడని తెలిపారు. దీంతో అతని నుంచి తన డబ్బు తిరిగి ఇప్పించేలా చేయమని తన మాజీ భర్తను కోరానన్నారు. ఇటీవల ఆయన ఫోన్ చేసి కేకే.నగర్‌కు రా నీ డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో తాను అక్కడికి వెళ్లానన్నారు. అక్కడ అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కమ్ డివిజన్ ఉపకార్యద ర్శి మునివేల్ ఉన్నారని తెలిపారు. ఆయన తనతో తనను గుర్తు పట్టలేదా అని అడిగారన్నారు. మీరు నడిగర్ సంఘంలో డాన్స్ శిక్షణకు వచ్చినప్పుడు పరిచయం అయ్యాం అని చెప్పారన్నారు.
 
 ఆ తరువాత అప్పుడప్పుడూ మునివేల్ తన ఇంటికి వస్తుండేవారని చెప్పారు. అది నచ్చని తన మాజీ భర్త శ్యామ్ మునివేల్ భార్యతో ఐదు లక్షలు ఇస్తాను రాధను వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యేలా చెయ్యి అని చెప్పారని ఈ విషయాన్ని తనకు మునివేల్ తెలిపారని రాధ పేర్కొన్నారు. కాగా తన భర్తను డిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కం డివిజన్ ఉప కార్యదర్శి భార్య ఉమాదేవి నటి రాధపై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పుళల్ జైలులో ఉన్న వైరమ్ అనే ఖైదీ తనను ఫోన్‌లో బెదిరించినట్లు ఆడియో టేపును బయట పెట్టి రాధ సోమవారం తనకు రక్షణ కావాలని కోరుతూ పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
 
 అదే విధంగా ఉమాదేవి తన భర్త, నటి రాధల రహస్య సంభాషణలను బయట పెట్టి కలకలం రేపారు. అయితే దీనిపై స్పందించిన నటి రాధ అది తన వ్యక్తిగత విషయం అని పేర్కొనడం గమనార్హం. పుళల్ జైలులో ఉన్న ఖైది వైరమ్ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, తను నటి రాధను బెదిరించి ఉంటాడని పోలీసులు నమ్ముతున్నారు. ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.వైరమ్ గురించి బలమైన ఆధారాలు లభిస్తే అతనిపై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపారు. నటి రాధ తనను ఖైదీ వైరమ్ ఫోన్‌లో బెదిరించారన్న ఆరోపణలను వైరమ్ భార్య లీనా ఖండించింది. తన భ ర్త పేరుతో ఎవరో బెదిరించి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. నటి రాధ, కోడంబాక్కం డివిజన్ ఉపకార్యదర్శి భార్య ఉమాదేవి, ఖైదీ వైరమ్ భార్య లీనా ఫిర్యాదులపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు