యువతుల కోసం వశీకరణ కాటుక

14 Mar, 2017 09:10 IST|Sakshi

చెన్నై: తమిళనాడు పెరంబలూరులో సంచలనం సృష్టించిన క్షుద్రపూజల కార్తికేయన్‌ ఉదంతంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజలకు పాల్పడిన అతడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెరంబలూరు ఎంఎం నగర్‌కు చెందిన కార్తికేయన్‌ (32) తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  (చదవండి...పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా)

ఇలా వుండగా పోలీసులు తాజాగా జరిపిన విచారణలో ఇతగాడు యువతులను లొంగదీసుకునేందుకు వశీకరణ కాటుకను ఉపయోగించినట్లు సమాచారం. కాగా ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే అతడు నివాసం ఉంటున్న ఇంట్లో యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు