లిక్కర్‌ సేల్స్‌; మహిళల నిరసన

8 May, 2020 14:10 IST|Sakshi

చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరవడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండగానే మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మహిళాలోకం మండిపడుతోంది. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన చేపట్టారు. లిక్కర్‌ షాపులు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎ‍త్తున ఆందోళనకు దిగారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్యం దుకాణాల ముందు బైఠాయించారు. (తమిళనాడులో కరోనా విలయతాండవం)

అమ్మకాలు అదుర్స్‌..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమిళనాడులో గురువారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా మొదటి రోజే రాష్ట్ర ఖాజానాకు రూ. 172 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత వైన్‌ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు క్యూ కట్టారు. మొదటి రోజే 20 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోయిదంటే మందు బాబులు ‘ఎంత దాహం’ మీద ఉన్నారో అర్థమవుతోంది. ప్రతి రాష్ట్రంలో అమ్ముడుయే పాలకంటే ఇది 4 లక్షల లీటర్లు మాత్రమే తక్కువ. ఇక మహిళలు ఆందోళనకు తిరుచ్చిలోనే ఓ మద్యం దుకాణం ‘ఆల్కహాలికుల’ కోసం షామినా, కుర్చీలు ఏర్పాటు చేయడం విశేషం. (టోకెన్ ఉంటేనే మ‌ద్యం అమ్మ‌బ‌డును)

మరిన్ని వార్తలు