బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై

17 Aug, 2014 01:08 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యూరు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించారు. మరో సీని యర్ నేత హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా పార్టీ నియమించింది. పార్టీలో అనేక హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న తమిళిసైకు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్ర చారం ఎంతో కాలంగా సాగుతోంది. అయితే ఆమెకు పోటీగా సీనియర్ నేతలు ఇల గణేశన్, హెచ్ రాజాల పేర్లు కూడా వినిపించాయి. గవర్నర్ పదవిని ఆశిస్తున్న ఇల గణేషన్ స్వచ్ఛదంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పోటీ తమిళిసై, రాజాల మధ్యనే నడిచింది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు పార్టీ ఎట్టకేలకూ తెరదించి తమిళిసైకు పార్టీ పగ్గాలు అప్పగించింది.
 
 మహిళాకర్షణతో చెక్
 దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కుంచుకునే అంశం లో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకునేలా లేదు. రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ర్టంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తరువాత ఆపార్టీకి జీవం వచ్చింది. తిరుచ్చిలో మోడీ నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభతో ఒక్కసారిగా ఎక్కడలేని ఊపువచ్చింది. ఆ తరువాత వరుసగా తమిళనాడులో సాగిన మోడీ సభలతో బీజేపీ ఒక ప్రధాన పార్టీగా మారిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకే మినహా అన్ని ప్రాంతీ య పార్టీలు బీజేపీ పొత్తుకోసం క్యూకట్టాయి. కూటమి లో చేరిపోయాయి. రాష్ట్రంలో బలమైన ఏకైక జాతీయ పార్టీగా వెలుగొందుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పరిణామంతో ఖంగుతింది. ఎన్నికల ఫలితాల తరువాత  బలహీన పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. దీంతో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి.
 
 అసెంబ్లీ ఎన్నికలే కొలమానం
 రాష్టంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాలకు 2016 అసెంబ్లీ ఎన్నికలే కొలమానంగా మారనున్నా రుు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఉండడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర అసెంబ్లీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కొత్త అధ్యక్షుని అన్వేషణ మొదలైంది. పాత పరిస్థితులలోనైతే ఏదో ఒక వ్యక్తికి కట్టబెట్టి చేతులు దులుపుకునేవారు. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చగల చతురుడిగా అమిత్‌షాపై ముద్రపడిపోగా, ఆ ముద్రను తమిళనాడుపై కూడా వేసేందుకు ఆయన భారీ కసరత్తునే చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని బలమైన పార్టీగా తీర్చిదిద్దగల వారికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని జాప్యం చేస్తూ వచ్చారు.
 
 రాష్ట్ర అధ్యక్షుని స్థానానికి మొన్నటి వరకు వినపడిన హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా నియమించడం ద్వారా తమిళిసైకు మార్గం సుగమం చేశారు. రాష్ట్రంలో అమ్మ (సీఎం జయలలిత) హవాను దీటుగా ఎదుర్కోవాలంటే మరో మహిళ అవసరమని అమిత్ షా భావించినట్లు సమాచారం.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు కమలనాథుల కరుణ కోసం కాచుకుని ఉన్నాయి. అన్నాడీఎంకే పరోక్షంగా ఇప్పటికే స్నేహహస్తం చాచింది.  అయితే గతంలో బీజేపీకి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో చేదు అనుభవం ఉంది. అలాగని బలమైన ప్రాంతీయ పార్టీ లేకుండా రాష్ట్రంలో నెగ్గుకురావడం అసాధ్యం. ఈ అంశాలన్నీ అమిత్‌షా తన అంతర్గత సమావేశంలో రాష్ట్ర నేతలతో చర్చించినట్లు సమాచారం. కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకంలో అమిత్‌షా ఆచితూచి అడుగువేసినట్లు జాతీయనేత ఒకరు పేర్కొనడం గమనార్హం.
 
 

మరిన్ని వార్తలు