కార్పొరేషన్లుగా తంజై, దిండుగల్

20 Feb, 2014 02:18 IST|Sakshi

 రాష్ట్రంలో కొత్తగా మరో  రెండు కార్పొరేషన్లు బుధవారం ఆవిర్భవించాయి.  ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా బాసిల్లుతున్న తంజావూరు, దిండుగల్  పట్టణాలు కార్పొరేషన్లు అయ్యాయి. తంజావూరు కార్పొరేషన్ తొలి మేయర్‌గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పది  కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, సేలం, తిరునల్వేలి, తిరుప్పూర్, ఈరోడ్,  తూత్తుకుడి, వేలూరు ఆ జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి పథంలో ఈ కార్పొరేషన్లు దూసుకెళ్తోన్నాయి. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలతో పాటుగా న గరాల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లు అన్నీ అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరాయి. దీంతో నిధుల వరద కార్పొరేషన్ల అభివృద్ధికి పారుతున్నాయి.
 
 మరో రెండు: కార్పొరేషన్ల సంఖ్య 12కు చేర్చేందుకు ప్రభుత్వం గత ఏడాది  నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన, అభివృద్ధి దృష్ట్యా మరో రెండు నగరాలను కార్పొరేషన్లుగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో తంజావూరు, దిండుగల్‌ను చేర్చా రు. జిల్లా కేంద్రాలుగా ఉన్న ఈ నగరాల్ని మరింత అభివృద్ధి పరచడం లక్ష్యంగా నగర పాలక సంస్థను కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందు కు ప్రభుత్వం నిర్ణయించింది. తంజావూరు జిల్లా అంటే, అందరికీ గుర్తుకొచ్చేది పల్లవ రాజులు, మదురై, తంజావూరు నాయక రాజు లు, పాండియ, విజయనగర రాజుల వైభవాన్ని చాటే కళా ఖండాలు, నిర్మాణాలే. తంజావూరు పెయిటింగ్స్, బొమ్మలు ప్రపంచ ప్రఖ్యా తి గాంచి ఉన్నాయి. యునెస్కో గుర్తింపును సైతం పొందిన తంజావూరు డెల్టా జిల్లాలో ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వస్తున్నది. తంజావురుకు నిత్యం వస్తున్న పర్యాటకులను, అక్కడి జనాభాను పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం తంజావూరు పురపాలక సంస్థను కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఇక దిండుగల్ అంటే, అందరికీ గుర్తుకు వచ్చేది పళని సుబ్రమణ్య స్వామితోపాటు ప్రకృతి అందాలను తనలో ఇముడ్చుకున్న కొడెకైనాల్. రైల్వే జంక్షన్‌గా, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న దిండుగల్‌ను సైతం కార్పొరేషన్ జాబితాలోకి చేర్చేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను అసెంబ్లీలో మంత్రి కేపి మునుస్వామి గత ఏడాది చివర్లో దాఖలు చేశారు.
 
 ఆవిర్భావం: పనులన్నీ చక చకా సాగుతుండడంతో తంజావూరు, దిండుగల్ కార్పొరేషన్లుగా బుధవారం ఆవిర్భవించాయి. మునిసిపాలిటీ కార్యాలయాలను కార్పొరేషన్లుగా తీర్చిదిద్దారు. అందుకు తగ్గ మౌళిక సదుపాయాలు, కౌన్సిల్ హాల్, కమిషనర్, మేయర్, ఇతర ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక గదులు రూపదిద్దుకున్నారుు. కార్పొరేషన్ పరిధిలోకి జనభా ప్రాతిపదికన అనేక గ్రామాల్ని చేర్చారు. సకాలంలో అన్ని పనులు ముగియడంతో ఆ రెండు మునిసిపాలిటీలు బుధవారం నుంచి కార్పొరేషన్లుగా మారినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి అన్నాడీఎంకే నాయకులు సంబరాలు చేసుకున్నారు. అధికారులకు స్వీట్లు పంచి పెట్టారు. తంజావూరు తొలి మేయర్‌గా సావిత్రి గోపాల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మునిసిపాలిటీ చైర్మన్‌గా ఉన్న ఆమెకు మేయర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక దిండుగల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించినా, తొలి మేయర్ ఎవర్నది తేలాల్సి ఉంది. ఇది వరకు మునిసిపాలిటీగా ఉన్న దిండుగల్‌కు చైర్మన్‌గా వి మరుతరాజ్ వ్యవహరిస్తున్నారు. ఆయనకే తొలి మేయర్ చాన్స్ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు