రోమియో టీచర్‌

11 Jul, 2019 07:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థినికి ప్రేమలేఖ.. టీచర్‌ సస్పెండ్‌

చెన్నై ,తిరువొత్తియూరు: దిండుక్కల్‌ సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థినికి అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు రాజా అశోక్‌కుమార్‌ ప్రేమలేఖ ఇచ్చాడు. ప్రేమలేఖ విద్యార్థికి ఇచ్చిన సంగతి పాఠశాలలో సంచలనం కలిగించింది. దీనిపై పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు