మహా విజయంపై బీజేపీ వేడుకలు

25 Feb, 2017 15:20 IST|Sakshi
హైదరాబాద్: మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాదించినందుకు తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందన్నారు. ఎక్కడో గెలిస్తే సంబరాలు కాదని, ఇక్కడ కూడా పార్టీ బలపడాలన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలి.. కష్టపడితే పలితం ఉంటుందని.. పోరాటానికి సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వ పతకాలే కార్యకర్తలకు ఆయుధాలని పార్టీ సిద్ధాంతలఫై రాజీపడొద్దన్నారు. తెలంగాణ, ఏపీలకు ఒరిస్సా ప్రేరణ కావాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి పట్టం కట్టారని అది ప్రజలకు మోదీపై నమ్మకానికి నిదర్శనమన్నారు. ఒవైసీల పాలనలో పాతబస్తీలోని ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, మజ్లీస్ ను పోషించింది కాంగ్రెస్ కాదా,  కాంగ్రెస్ కు మజ్లీస్ కు పొత్తు లేదా, కేసీఆర్ నోట్ల రద్దు ను స్వాగతిస్తే తప్పా అని ప్రశ్నించారు. నోట్ల బదిలీ ఫై బీజేపీ అనుకున్నంత ప్రచారం చేయలేకపోయామన్నారు. పరిపాలన కాంగ్రెస్ జన్మ హక్కు గా ఫీల్ అవుతోందని,  చిదంబరం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ఐక్యమత్యానికి  విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ముస్లింలు పార్టీకి ప్రత్యర్థులు కారని.. పాత బస్తీలో ప్రజలకు ఏమీ చేయని మజ్లీస్ పార్టీ తమకు ప్రత్యర్థి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 
 
తెలంగాణాలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయంగా మారాలని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, మోడీ విధానాలను పల్లెల్లోకి తీసుకుపోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు.తెలంగాణ లో కూడా బీజేపీ కి అనుకూల వాతావరణం ఉందని. బీజేపీ ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కూడా మెజారిటీ తో అధికారం లోకి వస్తుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు.భారత దేశ రాజకీయాల్లో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయని, అన్ని పార్టిలు బీజేపీ ని లక్ష్యంగా పెట్టుకొని విమర్శిస్తున్నాయని, బీజేపీ వైపు అన్నివర్గాల ప్రజలు బీజేపీ తోనే ఉన్నారని ఆయన తెలిపారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు