'కొత్త క్యాంపు ఆఫీసు ఎందుకు?'

18 Oct, 2016 14:21 IST|Sakshi
'కొత్త క్యాంపు ఆఫీసు ఎందుకు?'

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాచరిక పోకడలు అనుసరిస్తున్నారని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కావాలనే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ పేదలకు ఇళ్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు