సివిల్స్‌లో తెలుగు ప్రభంజనం

1 Jun, 2017 07:58 IST|Sakshi
సివిల్స్‌లో తెలుగు ప్రభంజనం

► ఎంపికైన 1099 మందిలో 90 మందికిపైగా మనోళ్లే..

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశంలో అత్యున్నత సర్వీస్‌ అయిన సివిల్స్‌లో తెలుగు అభ్యర్థులు దుమ్మురేపారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 90 మంది వరకు సివిల్స్‌లో విజయం సాధించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామి నేషన్‌–2016 ఫలితాలు వెల్లడించింది. కర్ణాట కకు చెందిన కేఆర్‌ నందిని తొలి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్‌గా ఎంచుకుని ఆమె సివిల్స్‌ రాసి నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించారు. ఈమె ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ అధికారిగా శిక్షణ పొందుతున్నారు. రెండోర్యాంకును అన్మోల్‌ షేర్‌ సింగ్‌ బేడీ సొంతం చేసుకున్నారు.

పంజా బ్‌కు చెందిన ఈయన బిట్స్‌ పిలానీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ పూర్తి చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ మూడో స్థానంలో నిలవగా, విజయవా డకు చెందిన కొత్తమాసు దినేశ్‌కు మార్‌(వరంగల్‌ ఎన్‌ఐటీలో చదివారు) ఆరో ర్యాంకు సాధించారు. మాజీ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ కుమారుడు ముజామిల్‌ ఖాన్‌ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు కైవసం చేసు కున్నారు. ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 11,35,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,59,659 మంది పరీక్ష రాశారు. వీరిలోంచి 2016 డిసెంబర్‌లో నిర్వహించిన మెయిన్స్‌కు 15,452 మంది ఎంపికయ్యారు.

తుదకు 2,961 మందికి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మౌఖిక పరీక్ష నిర్వహించి 1099 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేశారు. ఐఏఎస్, ఐఎఫ్‌ ఎస్, ఐపీఎస్, సెంట్రల్‌ సర్వీసెస్‌ – గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ సర్వీసులకు వీరు అర్హత సాధించారు. వీరిలో 253 మంది మహిళలు ఉండటం గమనార్హం. టాప్‌–25లో 18 మంది పురు షులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వివిధ సర్వీసులకు ఎంపికైనవారిలో 500 మంది జనరల్‌ కేటగిరీలో, 347 మంది ఓబీసీ కేటగి రీలో, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ కేటగిరీల్లో ఉన్నారు. మరో 172 మందిని రిజర్వు లిస్టులో పెట్టారు. ఐఏఎస్‌కు ఎంపికైన 180 మందిలో జనరల్‌ 90, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14 మంది ఉన్నారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికైన 45 మంది అభ్యర్థుల్లో జనరల్‌ 26, ఓబీసీ 12, ఎస్సీ 06, ఎస్టీ కేటగిరీలో ఒక్కరు ఉన్నారు. ఐపీఎస్‌ కేటగిరీలో ఎంపికైన 150 మందిలో జనరల్‌ 81, ఓబీసీ 37, ఎస్సీ 18, ఎస్టీ 14 మంది అభ్యర్థులున్నారు.

కలిసొచ్చిన ఆంత్రోపాలజీ: సివిల్స్‌కు ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్న వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీనే ఆప్షనల్‌గా ఎంచుకున్నారు.

విజేతలు ఏమంటున్నారు..?
సివిల్స్‌లో ఆరో ర్యాంకు సాధించిన దినేశ్‌ వరంగల్‌ నిట్‌లో 2010–14 మెకానికల్‌ బ్రాంచీలో చదివారు. రెండు సంవత్సరాలుగా ఢిల్లీలో పొలిటికల్‌ సైన్స్‌ను సబ్జెక్ట్‌గా ఎంచుకుని సివిల్స్‌కు ప్రిపేర్‌ అయినట్లు తెలిపాడు. ఇక వైఎస్సార్‌ జిల్లావాసులు ఇద్దరు సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. కడపలోని బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్‌ కుమార్‌రెడ్డి 353వ ర్యాంకు సాధించారు. గతంలో ఐఎఫ్‌ఎస్‌లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. కడపలోని అక్కాయపల్లెకు చెందిన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి 354వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నిట్‌లో బీటెక్‌ చదివారు.

భవిష్యత్తులో ఐఏఎస్‌ను సాధించ డమే తన లక్ష్యమని సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌ పర్తిలోని పద్మశాలీ కాలనీకి చెందిన చెన్నూరి రూపేశ్‌ 526 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హసన్‌పర్తి జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసిన రూపేష్‌ ఆ తర్వాత పాలిటెక్నిక్‌ పూర్తి చేశారు. అనంతరం కిట్స్‌ కళాశాలలో బీటెక్‌ చదివారు. అలాగే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింతా కుమార్‌ గౌడ్‌ 608 ర్యాంకు సాధించారు. ఇంటర్‌ వరకు తెలుగు మీడియంలో చదివిన కుమార్‌ ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. సివిల్‌ సర్వీసే లక్ష్యంగా ఐదుసార్లు పరీక్షలు రాశాడు. 2015లో 768 ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. తాజా ర్యాంకుతో ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్‌ నుంచి ఇద్దరు అభ్యర్థులు సివిల్స్‌–2016లో అర్హత సాధించారు.  వీరిలో పి.ప్రేమ్‌ ప్రకాశ్‌ (ర్యాంకు–971), ఎం.నరేశ్‌కుమార్‌ (ర్యాంకు–1015) ఉన్నారు.

ఏకే ఖాన్‌ కుమారునికి 22వ ర్యాంక్‌
సాక్షి, హైదరా బాద్‌: మాజీ ఐపీ ఎస్‌ అధి కారి, ప్రభుత్వ మైనా ర్టీ సంక్షేమ వ్యవ హారాల సలహా దారు ఏకే ఖాన్‌ కుమారుడు ముజామిల్‌ ఖాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్‌ సాధించారు. నగరంలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ముజామిల్‌ గత ఏడాది సివిల్స్‌ రాసి ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఈసా రి 22వ ర్యాంక్‌ రావడంతో ఐఏఎస్‌కు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఎంపికలో భగవత్‌ పాత్ర..
దేశవ్యాప్తంగా 100 మంది సివిల్స్‌కు ఎంపిక కావడం వెనుక రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ పాత్ర ఉంది. సివిల్స్‌ ఇంటర్వూ్యలకు సంబంధించి ఈ ఏడాది దాదాపు 300 మందికి తర్ఫీదు ఇచ్చారు.300 మందిలో దాదాపు 100 మంది వివిధ ర్యాంకులు సాధించారని మహేష్‌ భగవత్‌ ‘సాక్షి’కి తెలిపారు.

దివ్యాంగుల్లోఆత్మస్థైర్యం నింపడానికే..
హైదరాబాద్‌: సివిల్స్‌లో 167వ ర్యాంకు వచ్చిన ప్పటికీ ఐఏఎస్‌లో చేర ను. కేవలం దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే నేను సివిల్స్‌ రాశాను. 2004 సివిల్స్‌లో కూడా నాకు 399వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం నేను రక్షణ శాఖ (ఇండియన్‌ డిఫెన్స్‌)లో పనిచేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సివిల్స్‌ కోచింగ్‌ కోసం అభ్యర్థులు నగరానికి వస్తున్నారు. వారికి అవసరమైన మెళకువలు బోధిస్తున్నాను. 3వ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ కూడా నా విద్యార్థే. ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని, ఆత్మవిశ్వాసంతో సివిల్స్‌ రాయాలని వారికి సూచించాను.    –బాలలత, దివ్యాంగురాలు, 2017 సివిల్స్‌లో 167వ ర్యాంకర్‌

దినపత్రికలు చదివే సివిల్స్‌ సాధించా..
సివిల్స్‌లో 142వ ర్యాంక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. అటు ఉద్యోగం చేస్తూనే సొంతంగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. రోజూ దినపత్రికలతో పాటు ఆన్‌లైన్‌ మెటీరియల్‌ సేకరించి చదివాను. – ప్రవీణ్‌ శామీర్‌ కుమార్‌ చిరువూరి

 

మరిన్ని వార్తలు