తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి

9 Sep, 2017 14:08 IST|Sakshi
తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో శనివారం అక్కడ ఆందోళన నెలకొంది. కర్ణాటక రీజనల్‌ లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని వారు ఆరోపించారు. పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు.
 
విద్యార్థుల హాల్‌ టికెట్లను చించేసి వీరంగం సృష్టించారు. బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల వద్ద కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కన్నడిగుల తీరుతో తెలుగు విద్యార్థులు హుబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నడ సంఘాల ఆందోళనతో పరీక్ష ను రద్దు చేశారు.
కాగా తమ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్‌ పరీక్షలు రాయడానికి వీల్లేదని తెలుగు అభ్యర్థులకు గుర్తు తెలియని వ‍్యక్తుల నుంచి ఇంతకముందే బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. కర్ణాటకలో పరీక్షలు రాసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సిద్ధమయ్యారు. కానీ కన్నడ సంఘాలు తమను పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.