తెలుగుకు ఆదరణ కరువు

20 May, 2015 05:15 IST|Sakshi
తెలుగుకు ఆదరణ కరువు

హొసూరు:తమిళనాడులో తెలుగు భాషకు రోజురోజుకూ ఆదరణ కరువైతుంది. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న క్రిష్ణగిరి జిల్లాలో తెలుగు భాష నిరాదరణకు గురవుతోంది. గతంలో క్రిష్ణగిరి జిల్లాలో తెలుగు పాఠశాలలు, తెలుగు బోర్డులు దర్శనమిచ్చేవి. 2006న తమిళనాడులో నిర్బంద తమిళభాషా చట్టం అమలుతో తెలుగు బోర్డులు కనుమరుగైపోతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా తెలుగులో కరపత్రాలు వేయడంలో  అశ్రద్ద చూపుతున్నాయి. గ్రామ పండుగలలో  భక్తులు ప్లెక్సీలు కూడా తమిళంలోనే వేస్తున్నారు. క్రిష్ణగిరి  జిల్లాలో ఒకప్పుడు తెలుగు భాష  అన్ని చోట్ల అలరాలుతుండేదని, ప్రస్తుతం తెలుగు బోర్డులు, తెలుగు అక్షరాలు కనుమరుగైతున్నాయని తెలుగు సంఘాలు, తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివిధ రాజకీయ పార్టీలలోని  తెలుగు వారు పార్టీ కార్యకలాపాలు  తెలుగులో కరపత్రాల ద్వారా  తెలుగు వారికి తెలియజేయాలని, అన్ని రాజకీయ పార్టీలలోని తెలుగు వారు  ఈ విషయంపై శ్రద్ద వహించాలని తెలుగు సంఘాల నాయకులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు  స్థానిక భాషల్లో ప్రభుత్వ పనులు తెలియాలని స్పష్టంగా  సూచిస్తున్నా అధికార్లు పట్టించుకోలేదని తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నారు.  తెలుగు వారు ఐఖ్యమత్యంతో తెలుగు భాషా, సంస్కృతులను కాపాడుకోవాలని తెలుగు సంఘ నాయకులు వేర్వేరుగా అభిప్రాయాలను తెలియజేశారు. 

మరిన్ని వార్తలు