గజగజ...

18 Dec, 2013 03:14 IST|Sakshi

= గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు   
 = గతంలో కనిష్ట ఉష్ణోగ్రత  8.4 డిగ్రీల సెల్సియస్
 = ప్రస్తుతం ‘బెల్గాం’లో 5.9 డిగ్రీలుగా  నమోదు  
  1970 నాటి రికార్డు బద్దలు
 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో చలి విశ్వ రూపం దాల్చుతోంది. గత రికార్డులను బద్ధలు కొడుతూ కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. బెల్గాం జిల్లాలో ఈ నెల 11న కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1970లో నమోదైన 8.4 డిగ్రీలే ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డుగా ఉంది. బీదర్‌లో ఈ నెల 13న ఆరు డిగ్రీల సెల్సియస్‌గా (1936లో 10) నమోదైంది.

తుమకూరులో ఈ నెల 11న 8.7 (1981లో 10.4), చిత్రదుర్గలో 8.2 (1945లో 8.3), బళ్లారిలో 9.7 (1926లో 10.6), రాయచూరులో 9.7 (1945లో 10), గదగలో 8.7 (1925లో 10), శివమొగ్గలో 7.2 (1966లో 7.4), చిక్కమగళూరులో 9 (1975లో 11), దక్షిణ కన్నడలో 16.2 (1950లో 16.7), ఉత్తర కన్నడలో 9.5 (1966లో 15.6)గా నమోదయ్యాయి. బెంగళూరులో ఈ నెల 10న 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే 1883లో అతి తక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
 

మరిన్ని వార్తలు