ఈ నెలలోనే పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం టెండర్లు

9 Jan, 2017 11:11 IST|Sakshi
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టే జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ జెన్‌కో (హైడల్‌) డైరెక్టర్‌ సీహెచ్‌. నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో ఒక్కొక్కటి 80 మెగావాట్లు చొప్పున మూడు యూనిట్లను నిర్మిస్తామని, మూడున్నరేళ్లలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండో దశలో మరో తొమ్మిది యూనిట్లను 18 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం మీద ఐదేళ్లనాటికి 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏటా 2,300 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.230 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు.

Tenders for Polavaram power station in january

మరిన్ని వార్తలు