మొరాయించిన ఈవీఎం

4 Dec, 2013 23:45 IST|Sakshi
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కె కామరాజ్ మార్గ్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాజీ రాష్ట్రపతి వెళ్లిన సమయంలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మొరాయించడంతో ఆయన తన వంతు కోసం గంటసేపు ఎదురుచూశారు. ‘‘తన ఓటు వేయడం కోసం చాలా సమయం వేచి చూసిన మాజీ రాష్ట్రపతి ఈవీఎం పని చేయడం లేదని తెలియడంతో ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి ఓటు వేశారు’’ అని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదే కేంద్రంలో రాష్ట్రపతితో పాటు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, నావిక, సైనిక దళాలకు చెందిన అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎం మొరాయించే సమయానికి అందులో 412 ఓట్లు పోలయ్యాయి. అనేక మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో పాటు నావికా దళాధిపతి డీకే జోషి, కేంద్రమంత్రి కపిల్‌సిబల్ తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం ంటి గంట సమయానికి 112 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సాంతికేక సమస్యలు తలెత్తడం వల్లనే వీటిని మార్చాల్సి వచ్చిందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వివరించారు. 
 
మరిన్ని వార్తలు