ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

22 Dec, 2013 23:42 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్: పుణేలోని డెక్కన్ జింఖానాలోగల ఆంధ్ర సంఘం ఆవిర్భావ దినోత్సవం ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుణే ఆదాయ పన్ను శాఖ కమిషనర్ బి.జి.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆహూతులను విశేషంగా అలరించాయి. నందిని పాటిల్ శిష్యబృందం ప్రదర్శించి న కూచిపూడి నృత్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆంధ్ర సంఘం సభ్యు లు శ్రీనివాస్‌రావు ప్రదర్శించిన హాస్యనాటిక అందరినీ నవ్వించింది. ఆ తర్వాత గాయని సుభాషిణి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. చివరగా సంఘం వ్యవస్థాపకులు కనకరాజు, శేషమాంబ కుమార్తె దామర్ల శేషు, భర్త వెంకట రమణారావు దంపతులు సంఘం అభివృద్ధికి చేసిన కృషికి గుర్తిం పుగా వారిని సభ్యులు సన్మానించారు. ఈ  కార్యక్రమంలో వి.వి.రామారావు, ఐ.వి.రెడ్డి, టి.వి.శ్రీనివాస్, శేషగిరిరావు, నాగప్రసాద్  పాల్గొన్నారు.
 
 ఆంధ్ర సంఘం ఆవిర్భావం
 1941లో ఈ సంఘాన్ని తెలుగు వ్యక్తి అయిన అచం ట కనకరాజు, భార్య శేషమాంబ దంపతులు ఏర్పాటుచేశారు. మొదట ఈ సంఘం గ్రంథాల యంగా వెలిసింది. ఆ తర్వాత  సంఘంగా రూపాంతరం చెందింది. కనకరాజు పుణేలో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కమాండర్‌గా విధులు నిర్వహించేవారు. భార్య అనారోగ్యంతో చని పోవడంతో ఆమె జ్ఞాపకార్ధం ఇక్కడ నివసిస్తున్న తెలుగువారి కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడ్డారు. అప్పట్లో తెలు గు వారు న్యాయవిద్య చదువుకునేందుకు పుణేకి వచ్చేవారు. ఈ నేపథ్యంలో వీరి కోసం ఓ గ్రంథాలయాన్ని స్థాపించారు. అంతేకాకుండా వారికి అనేక సౌకర్యాలు కల్పించేందుకు కూడా కృషి చేశారు. వీరు ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం కాలక్రమే ణా తెలుగు సంఘంగా రూపాంతరం చెందింది. ఈ సంఘం కోసం నాలుగు అంతస్తుల భవనం కూడా నిర్మించారు. అంతేకాకుండా ఈ భవనంలో ఆంధ్ర సంఘం పాఠశాలనుకూడా నిర్వహిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు