తాలిబన్ల నగరంగా మారుతోంది

15 Mar, 2016 02:10 IST|Sakshi
తాలిబన్ల నగరంగా మారుతోంది

మాజీ మంత్రి సీటీ. రవి ఆగ్రహం
 
మైసూరు : సంస్కృతిక నగరంగా పేరు పొందిన మైసూరు మహా నగరం ప్రస్తుతం తాలిబన్ల నగరంగా మారుతోందని, అమాయకులను నిర్దాక్షిణ్యంగా పట్టపగలు హత్యలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సీ.టి. రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు నగరంలో ఆదివారం బీజేపీ నాయకుడు రాజు హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఆయన సోమవారం ఉదయం మైసూరు నగరంలో మెడికల్ కళాశాల మార్చురీ రూంకు వచ్చి రాజు హత్య విషయాలను పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం సీటీ రవి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ సొంత జిల్లాల్లో ఒక వర్గం వారిని దారుణంగా హత్య చేస్తున్నారన్నారు.  ఇప్పటి వరకు నాలుగురు దారుణ హత్యకు గురయ్యారని, పోలీసులు ఒక్కరిని కూడాఅరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. మైసూరు నగరంలో దుష్ట శక్తులు చేరి తాలిబన్ల లాగా దుర్మార్గపు పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిక్కమగళూరులో ఒక రౌడీషీటర్ హత్యకు గురైతే నాలుగురు మంత్రులు అతని ఇంటికి వెళ్లి మొసలి కన్నీళ్లు కార్చడంతో పాటు పరిహారం కూడా ప్రకటిస్తారని ఎద్దేవా చేశారు. రాజును హత్య చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హత్యకు గురైన రాజు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు.
 
 

మరిన్ని వార్తలు