‘ప్రతీకార’ ప్రణాళికలు !

13 Feb, 2014 03:06 IST|Sakshi
  • యడ్యూరప్ప ఓటమికి రాజకీయ ఎత్తుగడలు
  • శివమొగ్గ నియోజకవర్గంపై ఇంటెలిజెన్స్  సమాచారం సేకరించిన సిద్దు ?
  • బలమైన అభ్యర్థి కోసం గాలింపు  
  • శివమొగ్గ, న్యూస్‌లైన్ :  శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం బీఎస్.యడ్యూరప్పను సొంత ఊరిలోనే ఓడించి రాజకీయంగా మట్టికరిపించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య రహస్య ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. మొదటి నుంచి యడ్యూరప్పకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య సత్సంబంధాలు అంతంతమాత్రమే. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధు తీవ్ర విమర్శలు చేసేవాడు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిద్ధు ముఖ్యమంత్రి కాగా యడ్యూరప్ప ప్రతిపక్షస్థానంలో ఉన్నారు.
     
    నాటి ప్రతీకారానికి పర్యవసానం :

    గత విధానసభ ఎన్నికల్లో వరుణా విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్యను ఓడించడానికి యడ్యూరప్ప తన వ్యక్తిగత కార్యదర్శి సిద్దలింగస్వామిని బరిలోకి నిలిపాడు. అయినా అంతిమంగా సిద్ధునే వరించింది.  శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి యడ్యూరప్ప పోటీ చేస్తుండటంతో ప్రతీకారం తీర్చుకోడానికి శివమొగ్గపై ప్రత్యేక దృషి సారించారు సిద్ధరామయ్య. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలతో, ఇంటెలిజెన్స్ ద్వారా  నియోజకవర్గ సవ ూచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు.. కుల సమీకరణలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జేడీఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎవ రనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతునే ఉంది.
     
    మంత్రి కిమ్మనె రత్నాకర్‌ను పోటీ చేయాలని సూచించారు. తాను దగ్గరుండి గెలిపిస్తానని సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే రత్నాకర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన కాగోడు తిమ్మప్ప పోటీ చేస్తే యడ్యూరప్పకు గట్టి పోటీ ఉంటుందని, జేడీఎస్ సైతం మద్దతు తెలిపే అవకాశం ఉండటంతో కాగోడును ఎన్నికల్లో పోటీ చేయించడానికి ఒత్తిడి తెస్తున్నారు. అయితే తాను లోక్‌సభ బరిలో నిలబడేది లేదని కాగోడు స్పష్టం చేసినట్లు సమాచారం.
     

మరిన్ని వార్తలు