తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు

31 Jul, 2017 06:58 IST|Sakshi
తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు

తమిళసినిమా: తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని మ్యూజిక్‌ అసోసియేషన్‌ ఆవరణలో జరిగాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ప్రస్తుత నిర్వాహకుల గడువు ముగియడంతో ఆదివారం ఎన్నికల అధికారి మాజీ మేజిస్ట్రేట్‌ బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరిగింది.

ఈ ఎన్నికల్లో దర్శకుడు విక్రమన్‌ అధ్యక్షతన పుదు వసంతం జట్టు, పుదియ అలైగళ్‌ జట్లు పోటీ పడ్డాయి. అయితే పుదు వసంతం జట్టుకు చెందిన దర్శకుడు విక్రమన్‌ అధ్యక్షుడుగాను, ఆర్‌కే సెల్వమణి కార్యదర్శిగాను పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, కోశాధికారి, ఉపాధ్యక్షుడు, ఉపకార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. పుదు వసంతం జట్టులో ఉపాధ్యక్షుడు పదవికి కేఎస్‌ రవికుమార్, ఆర్‌వీ ఉదయకుమార్, ఉపకార్యదర్శి పదవికి రమేష్‌ఖన్నా, మనోజ్‌కుమార్, ఎ.వెంకటేశ్, అరివళగ¯Œలు, కోశాధికారి పదవికి పేరరసు పోటీ బరిలో ఉన్నారు.

కార్యవర్గ సభ్యుల పదవులకు చిత్రా లక్ష్మణన్, మనోబాలా, సుందర్‌ సి, ఎళిల్, లింగుస్వామి, కదిర్, ఆర్‌.కన్నన్, ఏకాంబవానన్, తంబిరాజన్, ఆర్‌కే కన్నన్, ముత్తువడుగు, భూమినాథన్‌ పోటీ పడ్డారు. అదేవిధంగా పుదియ అలైగల్‌ జట్టులో కోశాధికారి పదవికి జగదీశన్, ఉపాధ్యక్షుడి పదవికి సుబ్రమణ్య శివ, ఉపకార్యదర్శి పదవులకు బాలమురళీ వర్మ, ఐదుకోవివాన్, నాగరాజన్, మణికంఠన్, రామకృష్ణన్‌ పోటీపడ్డారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాందాస్‌ పోటీలో నిలబడ్డారు. సంఘంలో మొత్తం 3,400 మంది సభ్యులుండగా అందులో 2,300 సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి తరువాత విడుదలయ్యాయి.

>
మరిన్ని వార్తలు