'ప్రవృత్తి’కి పరదేశంలోనే నాంది !

15 Mar, 2016 02:08 IST|Sakshi
'ప్రవృత్తి’కి పరదేశంలోనే నాంది !

విదేశీ  కరెన్సీ, నాణేల సేకరించడంలో కోలారు వాసి దిట్ట
25 దేశాలకుపైగా కరెన్సీ సేకరణ
వృత్తి పరంగా డ్రైవింగ్ శిక్షకుడు...
 

కోలారు : విదేశీ నాణేలు, కరెన్సీల సేకరణలో నగరానికి చెందిన కోలారమ్మ డ్రైవింగ్ స్కూల్ యజమాని ఆర్ గోపాల్ ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 25కు పైగా విదేశీ కరెన్సీతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలు సేకరించారు. వీటిని అత్యత భద్రంగా తన డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులోనే ఫ్రేము వేసి ప్రదర్శనకు ఉంచారు. 17 ఏళ్లుగా విదేశీ కరెన్సీ సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు భారతదేశానికి చెందిన పాత కాలం నాటి కరెన్సీని కూడా సేకరించారు. పదవ తరగతి వరకు చదువుకున్న ఆర్ గోపాల్ 1999లో డ్రైవింగ్ పాఠశాలను నగరంలోని ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

తాను విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో నాణేల సేకరణ చేయాలనే కోరిక కలిగిందని గోపాల్ తెలిపారు. నగరంలోని దేవరాజ్ అరసు మెడికల్ కళాశాల వైద్య  విద్యార్థులు ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ లెసైన్సుకోసం తన వద్దకు వస్తుంటారని వారి వద్దనుంచి వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించినట్లు తెలిపారు. గోపాల్ వద్ద ఇంతవరకు అమెరికా, కొరియా, సౌదీ అరేబియా, జపాన్, సింగపూర్, చైనా, మలేషియా, ఇరాక్, ఇండోనేషియా, లండన్, పాకిస్తాన్, కువైట్, బ్యాంకాక్, శ్రీలంక, ఓమెన్, ఫిలిపైై్పన్స్, నైజీరియా, కాంగో, భూటాన్, ఖతార్, నేపాల్, స్విట్జర్‌లాండ్ తదితర దేశాలకు చెందిన కరెన్సీలు ఉన్నాయి. మిగిలిన దేశాలకు చెందిన కరెన్సీని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నానని ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలను సేకరించాలనేది తన లక్ష్యమని గోపాల్ అన్నారు.
 
 

మరిన్ని వార్తలు