సిద్ధరామయ్యది తుగ్లక్ పాలన

25 Oct, 2016 00:22 IST|Sakshi
సిద్ధరామయ్యది తుగ్లక్ పాలన

బీజేపీ అధికారంలోకొస్తే ఎస్టీ కమిషన్ ఏర్పాటు
యడ్యూరప్ప


లింగసూగూరు :  రాష్ట్రంలో సిద్దరామయ్య తుగ్లక్ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం పట్టణ శివార్లలోని నారాయణపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వాల్మీకి పరివర్తన సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పలు ప్రజోపయోగ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అహింద మంత్రాన్ని జపిస్తూ వెనుకబడిన, దళిత, మైనార్టీ వర్గాల నోట్లో మట్టి కొడుతోందన్నారు. పథకాలు కేవలం ప్రకటనకు పరిమితమయ్యాయని, వాటికవసరమైన నిధులందించడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాల్మీకి సముదాయం ఐకమత్యంగా బీజేపీకి మద్దతు తెలిపి 150 స్థానాల్లో గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌టీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

‘పిల్లలను విద్యావంతులను చేసే బాధ్యత మీది, వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది’ అని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజూగౌడ సమావేశానికి అధ్యక్షత వహించగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప, నేతలు జగదీష్ శెట్టర్, ఆర్.అశోక్, ఎంపీలు బీ.శ్రీరాములు, శోభా కరంద్లాజే, కరడి సంగణ్ణ, భగవంత్ కూబా, ఎమ్మెల్యేలు సీఎం ఉదాసి, సీటీ రవి, కే.శివనగౌడ నాయక్, తిప్పరాజు హవల్దార్, అరవింద లింబావళి, సురేష్‌బాబు, నాయకులు గోవింద కారజోళ, కృష్ణప్ప, రేణుకాచార్య, గురుపాటిల్, దొడ్డనగౌడ పాటిల్, జెడ్పీ అధ్యక్షురాలు వీరలక్ష్మి, ప్రముఖులు ఎన్.శంకరప్ప, పాపారెడ్డి, సిద్దు బండి, దొడ్డనగౌడ, రేవునాయక బెళమగి, ఎస్‌కే బెళ్లుబ్బి, సోమలింగప్ప, కే.విరుపాక్షప్ప, శివరామేగౌడ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శరణప్పగౌడ జాడలదిన్ని, తాలూకా అధ్యక్షుడు దొడ్డనగౌడ హొసమని, ప్రభు హవల్దార్‌లతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు