విచారణ పేరుతో మహిళకు చిత్రహింసలు

5 Sep, 2016 01:42 IST|Sakshi
విచారణ పేరుతో మహిళకు చిత్రహింసలు

పోలీసుల వైఖరికి నిరసనగా మౌన ర్యాలీ


కృష్ణరాజపుర: చోరీకి సంబంధించి దొంగల కోసం ప్రయత్నించని పోలీసులు...ఫిర్యాదు చేసిన బాధితుడి భార్యను చిత్రహింసలకు గు రి చేశారని ఆరోపిస్తూ  అఖిల భా రత ఏక్తామంచ్ కార్యకర్తలు ఆది వారం భారీ మౌన ర్యాలీ నిర్వహించి పోలీసుల తీరును ఖండించారు. ఆందోళనకారులు మాట్లాడుతూ కే.ఆర్.పురలోని చిక్కదేవసంద్రలో బుందారామ్  పంచరత్న జ్యువెల్లర్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడన్నారు.  ఆగస్ట్26న   ముసుగులను ధరించిన దుండగులు అత ని ఇంట్లోకి చొరబడి రూ.5.35లక్ష ల నగదు, 4.750కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారన్నారు.

ఘటనపై బుందారామ్ పోలీసులకు ఫిర్యాదు చే యగా 30న  ఆయ న భార్య లీలాబాయిని పోలీసులు మరో ప్రాంతానికి తీసుకెళ్లి  విచార ణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అప్పటికే ఆమె అనారోగ్యంతో ఉందన్నారు. పోలీసుల దె బ్బలకు మరింత అనారోగ్యానికి గురైందన్నారు. దీంతో ఇందిరానగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలి ంచారన్నారు  లీలాబాయిని హిం సించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

 

>
మరిన్ని వార్తలు