మూడో దఫా రుణమాఫీ నిధుల విడుదల

8 Nov, 2016 18:54 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు రైతు రుణమాఫీ మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగేళ్లలో రుణమాఫీని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మొత్తం రుణాల్లో ఇప్పటివరకు రూ.501 కోట్లను చెల్లించింది.

తాజాగా మరో రూ.125.65 కోట్లు అంటే 12.5% రుణ మాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా 1,99,678 మంది రైతులకు రుణభారం తగ్గనుంది. మొదటి సంవత్సరం ఒకే విడతలో 25శాతం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. గతేడాది రెండు వాయిదాల్లో రుణమాఫీ నిధులను చెల్లించింది. ఈసారి కూడా అదే తరహాలో 12.5 శాతం నిధుల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్‌షిప్ కార్యక్రమంగా దీన్ని భావిస్తోంది. అధికారపీఠం దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన రుణాలను మాఫీ చేయడం ద్వారా రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలో విడతల వారీగా రుణమాఫీ నిధుల చెల్లిస్తూ వస్తోంది.

మరిన్ని వార్తలు