ఆ ఫ్యాక్టరీలో వెయ్యి పాములు

26 Jul, 2016 20:03 IST|Sakshi
ఆ ఫ్యాక్టరీలో వెయ్యి పాములు

తమిళనాడులోని కాంచీపురం జిల్లా మధురాంతకంలోని సహకార చక్కెర కర్మాగారంలో వెయ్యి పాములు పట్టుకున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ కర్మాగారం కొన్నాళ్లు పనిచేసి ఆపై మూతపడింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మళ్లీ తెరిచి చక్కెర ఉత్పత్తిని ప్రారంభించారు. ఫ్యాక్టరీ మూతపడి ఉన్న సమయంలో పాముల సంచారం పెరిగిపోయింది. ఆ తరువాత కర్మాగారాన్ని తెరిచినా పాముల బెడద తప్పలేదు. మూడు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతుంటారు. దీంతో సహకార శాఖాధికారులు వన్యప్రాణి విభాగం అధికారుల సాయంతో పాములను పట్టేవాళ్లను రప్పించారు. పది మందితో కూడిన పాములు పట్టే బృందం సోమ, మంగళవారాల్లో వివిధ జాతులకు చెందిన వెయ్యికిపైగా పాములను ఫ్యాక్టరీలో పట్టుకుంది. పట్టుబడిన పాములను గోనె సంచిలో వేసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

 

మరిన్ని వార్తలు