మూడు రోజుల ముందే పెళ్లి చూపులు !

9 Nov, 2016 05:09 IST|Sakshi
మూడు రోజుల ముందే పెళ్లి చూపులు !

 = మస్తిగుడి షూటింగ్‌లో గల్లంతై మృతి చెందిన ఉదయ్ ఇంటిలో విషాద ఛాయలు
 = మూగబోయిన శాండిల్‌వుడ్

 
 సాక్షి, బెంగళూరు, బొమ్మనహళ్లి:  తిప్పగుండనహళ్లి ఘటనలో గల్లంతై మృత్యువాత పడిన ఉదయ్‌కు ఘటన జరగానికి మూడు రోజుల ముందు పెళ్లి చూపులు జరిగాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. ఇరు వైపుల వారు పెళ్లికి ప్రాథమికంగా అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమాల్లోకి రాక ముందు నగరంలోని యడియూరులో ఉండే ఉదయ్ మొదట ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించాడు. ఉదయ్ తల్లిదండ్రులు కౌసల్య, వెంకటేష్.
 
 కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే అక్క, చెల్లికి ఉదయ్ పెళ్లి చేశాడు. సినిమాల్లోకి రాక ముందు ఉదయ్ స్నేహితుల సహకారంతో కన్నడ దర్శకుడు కేడీ వెంకటేశ్ వద్ద అసిస్టెంట్‌గా చేరాడు. భారీకాయం ఉన్న ఉదయ్‌ను స్నేహితులు విలన్ క్యారెక్టర్‌కు బాగా సూటవుతావని ప్రోత్సహించేవారు. అదే సమయంలో ఇతని ఉత్సాహానికి దునియా విజయ్‌తో పాటు అనిల్ కూడా సహకారం అందించారు.   జిమ్‌ట్రైనర్ నుంచి... అనిల్ బెంగళూరు నగరంలోని బనశంకరి సమీపంలో ఉన్న కదిరేనహళ్లిలో నివాసం ఉంటున్నారు.
 
 అతని తల్లిదండ్రులు వేణుగోపాల్, సరస్వతి. అనిల్‌కు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లుఉన్నారు. అనిల్ మూడవ సంతానం. అనిల్‌కు భ్రమ్య అనే యువతితో వివాహం కూడా జరిగింది. వీరికి ఆరు సంవత్సరాల కుమారుడు, మూడేల్ల కుమార్తె ఉంది. సినిమాల్లోకి రాక ముందు మొదట ఫైనాన్షియర్ల వద్ద పని చేస్తు వాహనాలను సీజ్ చేసె పనితో పాటు జిమ్ములో ట్రైనర్‌గా పని చేస్తు తాను సొంతగా జిమ్‌ను కూడా ఏర్పాటు చేసుకొని అనంతర దునియా విజయ్ ద్వారా సినిమాల్లోకి వచ్చాడు.  
 
 తేనెటీగల దాడి :
కాగా సంఘటన జరిగిన వెంటనే ఒక్కోక్కరుగా చిత్ర రాజకీయ రంగానికి చెందిన వారితో పాటు పలువురు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తిప్పగొండనహళ్లి చెరువు దగ్గరకు వంద లసంఖ్యలో చేరుకున్నారు. కొంత మంది తాము కూడ అనిల్, ఉదయ్ రాఘవల గాలింపుసహాయ పడుతామని ముందుకు రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడి అరుపులు, కేకలతో చెట్లపై ఉన్న తేనేటీగలు స్థానికులపై దాడి చేశాయి. దీంతో వారు పరుగులు తీశారు. మరికొందరు ఆకులు, వస్త్రాలు అడ్డుపెట్టుకుని రక్షించుకున్నారు.
 
 రిస్కీ స్టంట్ తగదు  
 రిస్కీ స్టంట్‌లు తీయడం తగదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే సరిపోయేది. స్టంట్లు చేస్తూ ఇద్దరు కళాకారులు గల్లంతు కావడం బాధాకరం. ఈత రాదని చెప్పినా హెలికాప్టర్ నుంచి నీటిలో దూకడం వంటి సహసాలు మానుకోవాలి.   - అంబరీష్, సీనియర్ నటుడు
 
 బాధాకర సంఘటన
 సినిమాల షూటింగ్ చేసే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. స్టంట్స్ చేసే ఫైటర్లు సేఫ్టీని పాటించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న తరుణంలో ఇలా గల్లంతు కావడం శాండిల్‌వుడ్ రంగానికి తీరని లోటు.  - సుదీప్ నటుడు
 

 సాహసం చేయబోరుు...
 షూటింగ్‌లో ఇలాంటి దారుణం జరగడం విషాదకరం. తన జీవితంలో నిత్యం బాధించే
  సంఘటన ఇది.  షూటింగ్‌లో  అనిల్, ఉదయ్‌లు  సూచలు కూడా చేశారు. వారు ఇప్పటికి తన కళ్లల్లో మెదులుతూనే ఉన్నారు.      - నటి అముల్య  
 
 వారు మంచి స్నేహితులు    

 ఉదయ్, అనిల్ నాకు మంచి స్నేహితులు.  ఉదయ్ మృత్యువాత పడటం బాధాకరం. ఎంతో కష్టపడి సినిమా రంగంలో వస్తున్న తరుణంలో ఈ దారుణం జరగడం తనను తీవ్రంగా బాధించింది.
                                                   - రాకింగ్ స్టార్ యశ్
 
 

మరిన్ని వార్తలు