ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం 

7 Jun, 2020 07:15 IST|Sakshi

ఇంటి నుంచే కేసుల విచారణ 

వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలకు బెంచ్‌లు

సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టుకు తాళం పడింది. కరోనా న్యాయమూర్తులనూ వదలి పెట్ట లేదు. ఈ ప్రభావంతో ఇంటి నుంచే కేసుల విచారణపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఆన్‌లైన్‌ విచారణలకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు.  మద్రాసు హైకోర్టు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా ఈ హైకోర్టుకు ఒక్క రోజు మాత్రం తాళం వేస్తారు.  ఇందుకు ఈ హైకోర్టు స్థలాన్ని అప్పగించిన యజమాని గతంలో విధించిన షరతులే కారణం. ఆ తదుపరి వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక బెంచ్‌లు, అత్యవసర కాలంలో ప్రత్యేక బెంచ్‌లు అంటూ విచారణలు సాగిస్తూనే వస్తున్నారు.

లాక్‌డౌన్‌ పుణ్యమా కోర్టు సేవల్ని నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి మళ్లీ కోర్టుల్లో విచారణలు మొదలయ్యాయి. మద్రాసు హైకోర్టుతో పాటు మదురై ధర్మాసనంలోనూ విచారణలకు శ్రీకారం చుట్టారు. అయితే, న్యాయమూర్తులు, సిబ్బంది కోర్టుకు హాజరైనా, న్యాయవాదులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. న్యాయవాదులు ఆన్‌లైన్‌ ద్వారా వాదనల్ని వినిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. 33 బెంచ్‌ల ద్వారా కేసుల విచారణలకు శ్రీకారం చుట్టారు.  అయితే, ప్రస్తుతం కరోనా న్యాయమూర్తులను వదలి పెట్ట లేదు. ముగ్గురు న్యాయమూర్తులు కరోనా బారిన పడి ఉండడం వెలుగు చూసింది. చదవండి: ప్రియురాలి ఇంట్లో  ప్రియుడి దారుణహత్య 

మూసి వేత.. 
ముగ్గురు న్యాయమూర్తులు,  పలువురు సిబ్బందికి  కరోనా నిర్ధారణ కావడం, మరికొందరు న్యాయ మూర్తులకు పరిశోధన నివేదికలు రావాల్సి ఉండడం వెరసి హైకోర్టును మూసి వేయాల్సిన పరిస్థితి. హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానంతరం హైకోర్టుకు తాళం వేయడానికి నిర్ణయించారు. హైకోర్టుకు న్యాయవాదులు, సిబ్బంది ఇక రావద్దు అని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లకు నియ మించిన న్యాయమూర్తులు వారి వారి ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు చేపట్టనున్నారు. చదవండి: బాలీవుడ్‌ నటుడికి తమిళుల హారతి 

ఇందు కోసం ప్రత్యేకంగా న్యాయమూర్తులు వినిత్‌ కొతారి, సురేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఓ బెంచ్, న్యాయమూర్తులు శివజ్ఞా నం, పుష్పా సత్యనారాయణల నేతృత్వంలో మరో బెంచ్‌ ఏర్పాటు చేశారు. మరో నాలుగు సింగిల్‌ బెంచ్‌లను ఏర్పా టుచేశారు. వీటికి నలుగురు న్యాయమూర్తులను నియమించారు. కింది కోర్టుల్లోనూ అన్ని విచారణలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాగేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. అత్యవసర కేసుల్ని మాత్రం ఇక, విచారించేందుకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి.     

మరిన్ని వార్తలు