చూయింగ్‌గమ్‌తో హుండీలో నగదు చోరీ

6 Jun, 2017 06:40 IST|Sakshi
చూయింగ్‌గమ్‌తో హుండీలో నగదు చోరీ

యువకుడి అరెస్ట్‌
కేకేనగర్‌ : కర్రకు చూయింగ్‌ గమ్‌ అతికించి హుండీలో నగదు చోరిచేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లా అరక్కోణం రైల్వేస్టేషన్‌ సమీపంలో చర్చి ఉంది. ఈ చర్చి హుండీ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు చాలాసేపు నిలబడి ఉన్నాడు. దీంతో అక్కడున్న వారికి అతనిపై అనుమానం కలిగింది. దీంతో చాటుగా ఉండి అతన్ని గమనించగా కర్రకు చూయింగ్‌గమ్‌ అతికించి హుండీలో నగదు చోరీ చేయసాగాడు. వెంటనే యువకుడిని పట్టుకుని అరక్కోణం పోలీసులకు అప్పగించారు.

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వద్ద విచారణ జరిపారు. అతడు తిరువళ్లువర్‌ సమీపం చెవ్వాపేట ప్రాంతానికి చెందిన ఆరోగ్యరాజ్‌ (36) అని తెలిసింది. భార్యతో ఉద్యోగం చేస్తున్నట్లు అబద్దం చెప్పి రోజూ చెవ్వాపేట నుంచి అరక్కోణం రైలులో వచ్చేవాడు. అక్కడు ఆలయ హుండీల్లో నగదు చోరీ చేసి భార్యకు ఇచ్చేవాడని తెలిసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు