ఉగ్రవాదుల టార్గెట్ సీమాంధ్ర ?

4 May, 2014 03:31 IST|Sakshi
  • ముమ్మరంగా ‘చెన్నై సెంట్రల్’ బాంబుపేలుడు కేసు
  •  తమిళనాడు ఏడీజీపీ నేతృత్వంలో దర్యాప్తు
  •  బెంగళూరు చేరుకున్న ప్రత్యేక బృందం
  •  అనుమానితుల భావచిత్రాలు సేకరణ
  •  బెంగళూరు, న్యూస్‌లైన్:  ‘చెన్నై సెంట్రల్’ బాంబు పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీమాంధ్ర లక్ష్యంగా బాంబులు అమర్చి ఉంటారని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు గువాహటి చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో బాంబులు పేలాయని అధికారులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు సీబీ సీఐడీ ఏడీజీపీ కరణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు.

    శనివారం ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. కొందరి అనుమానితుల భావ చిత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురిని విచారణ చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లోనే గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు అమర్చి ఉంటారని తమిళనాడు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక రైల్వే పోలీసు విభాగం డీఐజీ శ్రీకంఠప్ప, బెంగళూరు సిటీ రైల్వే ఎస్పీ సిద్దరావ ుప్ప తమిళనాడు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
     

మరిన్ని వార్తలు