టిక్‌టాక్‌ అంటున్న యువత

13 May, 2019 10:20 IST|Sakshi

సాక్షి, చెన్నై: నిషేధం ఎత్తివేతతో టిక్‌టాక్‌కు ఆ దరణ రెట్టింపు అయినట్టుగా సర్వేలో తేలింది. యువతను తప్పదారి పట్టించడమే కాదు, అశ్లీ లతను పెంచడం, విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి వ్యవహారాలతో టిక్‌టాక్‌ యాప్‌పై ఫిర్యాదులు హోరెత్తిన విషయం తెలిసిందే. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో మద్రా సు హైకోర్టు నిషేధం విధించింది. పదిహేను రోజుల పాటుగా ఈ యాప్‌ను ఎవ్వరూ డౌన్‌ లోడ్‌ చేసుకోలేని రీతిలో పరిస్థితి నెలకొంది. చివరకు సుప్రీ కోర్టు ఆదేశాలతో మద్రాసు హైకోర్టు కొన్ని షరతులతో టిక్‌టాక్‌ యాప్‌పై ఉన్న నిషేధాన్ని గత నెల ఎత్తివేసింది. దీంతో ఈ యాప్‌ మళ్లీ అందుబాటులోకి రావడంతో వాడకం పెరిగినట్టుగా తాజాగా సర్వేలో వెలు గుచూసింది.

నిషేధం తదుపరి ఈ యాప్‌ను ప్లే స్టోర్‌ లోకి అనుమతించడంతో అతి తక్కువ సమయంలో 200 మిలియన్‌ యూజర్లుకు చేరుకుంది. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలతో ప్రత్యేక ఆకర్షణ దిశగా టిక్‌ టాక్‌కు కొత్త రంగులు అద్దడంతో రిటర్న్‌ ఆఫ్‌ టిక్‌టాక్‌లో 504 మిలియన్‌ వీవ్స్‌ వచ్చి ఉండటం ఆలోచించదగ్గ విషయం. ఇక, ప్రతిరోజు తమ యాప్‌ మేరకు విన్నర్స్‌ను ఎంపిక చేసి బహుమతులు అందిస్తున్నట్టు ఎంటర్‌టైన్‌మెంట్‌ స్ట్రాటజీ అం డ్‌ పార్ట్నర్‌షిప్స్‌ లీడ్‌–టిక్‌టాక్‌ (ఇండియా) సభ్యుడు సుమేదాస్‌ రాజ్‌గోపాల్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు