‘తిరువళ్లూరు’లో 88.23 శాతం ఉత్తీర్ణత

10 May, 2014 03:28 IST|Sakshi
‘తిరువళ్లూరు’లో 88.23 శాతం ఉత్తీర్ణత

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ప్లస్‌టూ పరీక్షా ఫలితాల్లో తిరువళ్లూరు జిల్లాలో 88.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ట్టు  కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించా రు. జిల్లా వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్షలకు 40,032 మంది విద్యార్థులు హాజరుకాగా, 35,320 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది మరో మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్లస్‌టూ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 289 పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీటిలో 69 పాఠ శాల విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు.

టాపర్లు వీరే: తిరువళ్లూరు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబి తాను కలెక్టర్ వీరరాఘవరావు శుక్రవారం ఉదయం విడుదల చేశారు. తమిళాన్ని ప్రథమ భాషగా ఎంచుకుని విధ్యనభ్యసించిన మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన కే. రంజిత్(1188) జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించగా, అంబత్తూరు సేతు భాస్కర పాఠశాలకు చెందిన పూజా(1187), పంజె ట్టి వేలమ్మాల్ పాఠశాల విద్యార్థిణి శరణ్య(1187) మార్కులతో రెండవ స్థానం సాధించారు. మూడవ స్థానంలో పంచెట్టి వేలామ్మాల్ పాఠశాలకు చెందిన రమ్యప్రభ(1186), మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన అనణ్య(1186) మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు.

ప్రభుత్వ పాఠశాల టాపర్లు: ప్రభుత్వ పాఠశాల పరిధిలోని పళవేర్కాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంగీత(1160), టీఎంకేవీ అమ్మయ్యార్‌కుప్పం పాఠశాలకు చెందిన ప్రభాకరన్(1160) మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానంలో పొన్నేరి ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన కుమరవేల్(1157) నిలిచారు. మూడవ స్థానంలో కవరపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆనంది(1153), అంబత్తూరు పీకే పాఠశాల విద్యార్థిని యువరాణి(1153) మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్టు కలెక్టర్ వివరించారు.

సత్తాచాటిన తెలుగు విద్యార్థి: ప్లస్‌టూ పరీక్షలలో తెలుగు, సంస్కృతం, ప్రెంచ్ భాషను మొదటి భాషగా ఎంచుకుని చదివిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న వేలమ్మాల్ విద్యార్థులు అజిత్(1192), శ్రీనిధి(1192) మార్కులతో మొదటి స్థానం సాధిం చారు. సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఎంచుకున్న దీపక్ అరవింద్(1189) మార్కులతో రెండవ స్థానంలోనూ,  ప్రెంచ్‌ను మొదటి భాషగా తీసుకున్న వేలమ్మాల్ విద్యార్థులు మణిగండ న్(1188), తెలుగును మొదటి భాషగా ఎంచుకున్న రంజిత్(1188) మూడవ స్థానంలో నిలిచారు. తమిళ విద్యార్థులకు దీటుగా సంస్కృతం, తెలుగు విద్యార్థులు రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు