నేడు డెల్టా బంద్

22 Nov, 2014 02:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: కావేరి నదిలో డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ శనివారం డెల్టా బంద్‌కు అన్నదాతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. బంద్ విజయవంతం లక్ష్యంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఐదు వందల చోట్ల నిరసనలకు ఏర్పాట్లు చేశారు. పదిహేను రైల్వే స్టేషన్ల ముట్టడికి  సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంకు కావేరి జలాల్ని రానివ్వకుండా చేయడం లక్ష్యంగా కర్ణాటక కుట్రలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వివాదం చేస్తూ వచ్చిన కర్ణాటక పాలకు లు తాజాగా, చుక్కు నీరు తమిళనాడులోకి రాకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. 48 టీఎంసీల సామర్థ్యంతో రెండు డ్యాంలను తమిళనాడుకు సమీపంలోని కర్ణాటక భూ భాగంలో నిర్మిం చేందుకు సన్నద్ధమయ్యూరు. ఈ డ్యాం నిర్మాణం జరిగిన పక్షంలో డెల్టా జిల్లా లు కరువుతో తల్లడిల్లాల్సిందే. ఈ పను ల్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి లేఖాస్త్రంతో సరిపెట్టింది. అయి తే అన్నదాతల్లో ఆగ్రహ జ్వాల బయలుదేరింది. కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కును పరిరక్షించుకోవడం లక్ష్యంగా పోరు బాటకు సిద్ధమైంది.
 
నేడు బంద్: కర్ణాటక ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని, కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ శనివారం నుంచి అన్నదాతలు పోరు బాట చేపట్టనున్నారు.

ఇందులోభాగంగా తొలి విడత నిరసనగా డెల్టా బంద్‌కు పిలుపు నిచ్చారు. తిరువారూర్, తంజావూరు , నాగపట్నం జిల్లాల్లో భారీ నిరసనలకు నిర్ణయించారు. ఇందుకు మద్దతు వెల్లువెత్తుతోంది. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటు చిన్నాచితకా పార్టీలు, త్వరలో పార్టీ పెట్టనున్న జికే.వాసన్ మద్దతు ప్రకటించారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు తాము సైతం అని మద్దతు ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల్లో భారీ బలగాల్ని రంగంలోకి దించారు.
 
ఐదు వందల చోట్ల నిరసనలు: బంద్ విజయవంతం లక్ష్యంగా అన్ని పార్టీలు, సంఘాలు ఉరకలు తీస్తున్నాయి. దీంతో ఆ మూడు జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప, వాణిజ్య సమూదాయాలు, అన్ని రకాలు దుకాణాలు మూత బడనున్నాయి. అలాగే, ప్రైవేటు బస్సులు, లారీలు, ఇతర వాహన యాజమాన్యాలు సైతం బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు.

తమ భవిష్యత్తు లక్ష్యం గా శనివారం ఎలాంటి సేవలు ఉండబోవని, అన్ని బంద్ అని ప్రజాసంఘాలు ప్రకటించాయి. ఈ విషయంగా ఈ బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘం నాయకుడు పీఆర్ పాండి మనోజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తమ బంద్‌కు మద్దతు వెల్లువెత్తుతోందన్నారు. ఉదయం ఆరు గంట ల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ప్రాంతాలు నిర్మానుష్యం కానున్నాయని, ప్రజాపయోగ సేవలు బంద్ కాబోతున్నాయని వివరించారు.

ఐదు వందల ప్రదేశాల్లో రాస్తారోకోలకు నిర్ణయించామని తెలిపారు. తంజావూరు, పాపనాశం, మైలాడుతురై,నాగపట్నం, మన్నార్‌కుడి, నీడా మంగళం తదితర పదిహేను రైల్వే స్టేషన్లను మట్టుడించనున్నామని రైళ్ల సేవల్ని అడ్డుకోనున్నామని ప్రకటించారు. తంజావూరులో జరిగే రైల్‌రోకోకు ఎండీఎంకే నేత వైగో, మైలాడుతురైలో వాణిజ్య సంఘం నేత వెల్లయ్యన్ నేతృత్వం వహించనున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు