కరీంనగర్ చేరుకున్న కేసీఆర్

26 Sep, 2016 13:21 IST|Sakshi
కరీంనగర్ చేరుకున్న కేసీఆర్

 ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో మిడ్ మానేరు ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు.  హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రికి వాతావరణం సరిగ్గాలేదని సూచించడంతో.. రోడ్డు మార్గంలో చేరుకున్నారు.ఈ పర్యటనలో వరద స్థితిని, ప్రాజెక్టుల జలకళను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే సీఎం మధ్యాహ్నం వీహంగ వీక్షణం చేసే అవకాశం ఉంది.

గండిపడ్డ మిడ్ మానేర్‌ను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. భారీ వరదలతో మిడ్‌మానేర్ డ్యామ్ స్పిల్‌వే పక్కన 20 మీటర్ల మేర గండి పడటంతో పాటు వంద మీటర్ల వరకు కట్ట కోతకు గురైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యామ్ కింది భాగంలో పది గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం ఉదయం నుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు సహాయ చర్యలు వేగవంతం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎల్‌ఎండీలో 19.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 78 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులు ఉంది. డ్యామ్ నిండుకుండను త లపిస్తుండటంతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. మరికొద్దిసేపట్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుండటంతో 40 గేట్లు ఎత్తి 4.26 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ తీర ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

>
మరిన్ని వార్తలు