27 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

25 Sep, 2016 17:59 IST|Sakshi
27 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

సత్తెనపల్లి–పిడుగురాళ్ల మధ్య ట్రాక్‌ పునరుద్ధరణ పనులు

విజయవాడ (రైల్వేస్టేషన్‌): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సత్తెనపల్లి–పిడుగురాళ్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో ట్రాక్‌ పునురుద్ధరణ పనుల దృష్ట్యా పలు రైళ్లను ఈ నెల 25, 26, 27వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్‌ శనివారం తెలిపారు.

రైలు నంబరు 12795 విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (26, 27వ తేదీల్లో రద్దు), 12796 సికింద్రాబాద్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (26, 27వ తేదీల్లో రద్దు), 12747 గుంటూరు–వికారాబాద్‌ (25, 26, 27వ తేదీల్లో రద్దు), 12478 వికారాబాద్‌–గుంటూరు (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 07757 సికింద్రాబాద్‌–వికారాబాద్‌ ప్రత్యేక రైలు (25వ తేదీ రద్దు), 07758 వికారాబాద్‌–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (25వ తేదీ రద్దు), 77676 మిర్యాలగూడ–పిడుగురాళ్ల ప్యాసింజర్‌   (25, 26, 27వ తేదీల్లో రద్దు),  77677 పిడుగురాళ్ల–మిర్యాలగూడ ప్యాసింజర్‌ (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 22118 (27వ తేదీ రద్దు), కాచిగూడ–గుంటూరు (నంబరు 22117) డబుల్‌ డెక్కర్‌ రైలు 27వ తేదీ రద్దు), గుంటూరు–కాచిగూడ డబుల్‌ డెక్కర్, రైలు నంబరు 57318 మాచర్ల–భీమవరం ప్యాసింజర్‌ (25, 26, 27వ తేదీల్లో రద్దు),

రైలు నంబరు 57317 గుంటూరు–మాచర్ల (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57324 మాచర్ల–నడికుడి ప్యాసింజర్‌ (24, 25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57323 నడికుడి–మాచర్ల ప్యాసింజర్‌ (25, 26, 27 తేదీల్లో రద్దు), రైలు నంబరు 57320 మాచర్ల–గుంటూరు ప్యాసింజర్‌ (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57319 గుంటూరు–మాచర్ల ప్యాసింజర్‌ రైలు (25, 26, 27 తేదీల్లో రద్దు). ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పీఆర్వో రాజశేఖర్‌ వివరించారు.

దారిమళ్లించినవి ఇవే..
గుంటూరు (నగరంపాలెం): సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఆదివారం (25.09.2016) నుంచి మంగళవారం (27.09.2016) వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే సీనియర్‌ డివిజనల్‌ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

25, 26 తేదీల్లో ట్రైన్‌ నంబరు 12603  చెన్నై–హైదరాబాద్, 25, 26, 27 తేదీల్లో 12604 హైదరాబాద్‌–చెన్నై చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలును, 25, 26, 27 తేదీల్లో 12734/12733 సికింద్రాబాద్‌–తిరుపతి–సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట, విజయవాడ, న్యూ గుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్లించారు. 25, 26 తేదీల్లో 17229 త్రివేండ్రం–హైదరాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17230 హైద్రాబాద్‌–తివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17016 భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్, 25, 26 తేదీల్లో 17015 సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్,

25, 26 తేదీల్లో 12704/12703 సికింద్రాబాద్‌–హౌరా–సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్‌– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, 25, 26 తేదీల్లో 12705/12706 సికింద్రాబాద్‌–గుంటూరు–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17255/17256 నర్సాపూర్‌– హైదరాబాద్‌– నర్సాపూర్, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, 25న 12764 సికింద్రాబాద్‌– తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, 26న 12763 తిరుపతి– సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్, 26న 07438 కొచ్చివెల్లి–టాటా స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్, 25న 17222 లోక్‌మాన్యతిలాక్‌–కాకినాడ ఎక్స్‌ప్రెస్, 26న 17232 నాగర్‌సోల్‌– నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, 26న నర్సాపూర్‌–నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు మళ్లించారు.

మరిన్ని వార్తలు