గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

27 Dec, 2014 02:23 IST|Sakshi
గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

వారి అభివ ృద్ధి కోసం ‘వనబంధు’ పథకం
త్వరలో 10 రాష్ట్రాల్లో పథకం అమలు
కేంద్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి జయోల్ ఉరాం

 
కృష్ణరాజపురం :  అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమం కోసం దేశంలోని ఎంపిక చేసిన 10 రాష్ట్రాల్లో ‘వనబంధు’ పధకాన్ని అమలు చేస్తామని  కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జయోల్ ఉరాం వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామన్నారు.  వర్తూరు వాగ్దేవి పాఠశాలలో అఖిల భారతీయ వన వాసి క ళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో శుక్రవారం  ఏర్పాటు చేసిన 17 వ జాతీయ వనవాసి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. గెలుపు-ఓటములతో నిమిత్తం లేకుండా క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, దీని ద్వారా ఏకాగ్రత సాధించడానికి సాధ్యమవుతుందని అన్నారు.

ఈ  పోటీల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తిపుర తదితర రాష్ట్రాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు నిర్వహిస్తారు. కార్యక్రమంలో  అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమం సహ సంఘటనా కార్యదర్శి అతులజోగ్, ఉపాధ్యక్షుడు జలేశ్వరబ్రహ్మ, గ్లోబల్ ఇంక్ అధ్యక్షుడు సుహాస్ గోపీనాధ్, కిరణ్, వెంకటేశ్‌సాగర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు