ముందే విడిపోవడం మంచిది

10 Aug, 2015 03:04 IST|Sakshi
ముందే విడిపోవడం మంచిది

 వివాహం, విభేదాలు, విడిపోవడాలు, కోర్టులు కేసులు అంటూ తలనొప్పి తెచ్చుకునే కంటే పెళ్లికి ముందే విడిపోవడం బెటర్ అంటున్నారు నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో ముందు వరుసలో ఉండే నటి త్రిష. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో సమీప కాలంలో కలకలం పుట్టిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. ఆ మధ్య ప్రేమ వదంతులతో ప్రచారాల హోరుకు కేంద్రబిందువుగా మారారు. ఆ తరువాత వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధం అయ్యి విస్మయం కలిగించారు. వివాహ నిశ్చితార్థం జరి గి పెళ్లి పెటాకులు అవ్వడంతో మరోసారి హెడ్‌లైన్‌లతో పత్రికలకెక్కారు.
 
  తాజాగా వివాహ వ్యవస్థపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ విస్మయానికి గురి చేస్తున్నా రు. అమ్మాయిలకు పెళ్లి అవసరమే అంటూ ఒకసారి, పెళ్లి చేసుకోకుండా చాలామంది జీవిస్తున్నారంటూ మరోసారి, తగిన వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఇంకోసారి ఇలా మార్చి మార్చి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అసలు తన మనస్థత్వం ఏమిటో ఎవరికీ అంతుపట్టని విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏమంటున్నారో చూడండి.
 
 వివాహ జీవితం సక్రమంగా అమరాలి. అలా కాని పక్షంలో మనస్పర్థలు, వివాహ రద్దు కోసం కోర్టుల చుట్టూ తిరగడం వేదన కలిగించే విషయం. ప్రస్తుత పరిస్థితిలో వివాహం చేసుకుని కోర్టుల ద్వారా విడిపోవడం కంటే, వివాహానికి ముందే ఇద్దరు కలసి మెలసి తిరిగి సరిపడకపోతే విడిపోవడం మంచిదని భావిస్తున్నాను. వివాహానికి ముందు అబ్బా యి, అమ్మాయి సహజీవనం చేయడం అనేది వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. ఇందువల్ల కుటుంబంతో సమస్యలు తలెత్తకూడదు. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటే జీవితాంతం బాధపడేకంటే ముందే కలిసి మెలిసి తిరిగి విడిపోవడం మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
 

మరిన్ని వార్తలు