-

సంతల్లో మావోయిస్టుల నోట్ల మార్పిడి

22 Nov, 2016 13:43 IST|Sakshi
సంతల్లో మావోయిస్టుల నోట్ల మార్పిడి
- ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
- రూ.70 వేల నగదు స్వాధీనం
 
చర్ల: పెద్ద నోట్ల రద్దు కష్టాలు మావోయిస్టులకు కూడా తప్పడం లేదు. వారు నగదు మార్పిడి కోసం ఆదివాసీలు, గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఇద్దరు మావోయిస్టుల సానుభూతిపరులు అరెస్టు అవడంతో ఈ విషయం బయటపడింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు సానుభూతిపరులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద చర్ల పోలీసులు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్న చర్లకు చెందిన గాదంశెట్టి రాజేష్, అజిత్ అనే ఇద్దరు సానుభూతిపరులను అరెస్టు చేశారు.
 
వారివద్ద నుంచి నిత్యావసర వస్తువులు, ప్రభుత్వం రద్దు చేసిన రూ.500 నోట్లు రూ. 70 వేల రూపాయల నగదును, ఏకే 47 విజిల్ కార్డులు 20 స్వాధీనం చేసుకున్నారు. పామేడు, బిజాపూర్, సుకుమా నుండి వారపు సంతలలో అధిక మొత్తంలో ఆదివాసీల ద్వారా మావోయిస్టులు తమ వద్ద ఉన్న డబ్బును మార్పిడి చేసుకుంటున్నారని చర్ల సీఐ సాయిరామన్ తెలిపారు. వారికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
 
మరిన్ని వార్తలు