ఉబర్ టాక్సీ డ్రైవర్ల నిరసన ప్రదర్శన

12 Dec, 2014 23:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమ సంస్థపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉబర్ కంపెనీ డ్రైవర్లు శుక్రవారం జంతర్‌మంతర వద్ద నిరసన ప్రదర్శన  చేపట్టారు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఉబర్ ట్యాక్సీలపై నిషేధం విధించడాన్ని వారు వ్యతిరేకించారు. నిషేధం  వల్ల తాము ఉపాధి కోల్పోయామని, ఒక  డ్రైవరు చేసిన తప్పిదానికి అందరినీ శిక్షించడం సబబు కాదన్నారు. తమ సంస్థ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా ఉన్నాయని నగరంలో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి డ్రైవరుగా పనిచేస్తున్న రంజిత్ సింగ్ చెప్పాడు.

ఉబర్ తన వంటి డ్రైవర్లు కార్లను కొనుగోలు చేసేందుకు చేయేత ఇచ్చిందన్నాడు. కంపెనీ సహాయంతో తాము లోన్లు తీసుకుని కారు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామన్నాడు.  అత్యాచార కేసులో  నిందితుడు నకిలీ పత్రాల సహాయంతో డ్రైవింగ్ లెసైన్సు సంపాదించాడని,  ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలకు ఇది అద్దం పడుతోందని ఆరోపించాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు