కలహాల కాపురం

11 Mar, 2015 03:10 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలు అధికారంలో ఉన్నా పలు అంశాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయి. గల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాలు వీరి మధ్యదూరాన్ని పెంచుతున్నాయి. 15 ఏళ్ల పొత్తుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో మంగళం పాడాయి. విడిపోయి పోటీ చేసినా... తరువాత కలసి అధికారాన్ని చేపట్టాయి. అయితే శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. చాలా విషయాలపై అసంతృప్తి వ్యక్త చేస్తోంది.

ముంబై కార్పొరేషన్‌లో కూడా వీరి కూటమి కొనసాగుతోంది. అక్కడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా బడ్జెట్, పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ వ్యతిరేకంగా పలు అంశాలను శివసేన లేవనెత్తుతోంది.
 
ప్రజా వ్యతిరేక విధానాలను ఒప్పుకునేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని కుండ బద్ధలు కొట్టారు. ముంబైలో చేపట్టాలనుకుంటున్న మెట్రో-3 ప్రాజెక్టు, పార్లమెంటులో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
సేనను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం....

శివసేన వైఖరిపై బీజేపీలో నిరసన వెల్లువెత్తుతున్నా ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ బిల్లు అంశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడినిట్లు సమాచారం.

అధికారికంగా వివరాలు తెలియరానప్పటికీ బిల్లుకు మద్దతు పలకాలని ఉద్ధవ్‌ను వెంకయ్య కోరినట్టు తెలిసింది. ఈ విషయంపై ఢిల్లీలో కూడా శివసేన ఎంపీలందరూ మంగళవారం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అంశంపై ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చలు జరిపారు. సరైన సమయంలో భూ సేకరణ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’

కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి

మరో చెన్నైగా బెంగళూరు !

మాకూ వీక్లీ ఆఫ్‌ కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!