మైదానాలను 45 రోజులు వాడుకోవచ్చు..

20 Dec, 2014 23:05 IST|Sakshi

సాక్షి, ముంబై: శివాజీపార్క్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర మైదానాల్లో ఇక నుంచి 45 రోజులపాటు రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదివరకు ఈ మైదానాలలో సంవత్సరంలో 30 రోజులపాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉండేది. చట్టంలో సవరణలుచేసి అదనంగా 15 రోజులు మైదానాలు వాడుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. దీంతో ప్రభుత్వ, రాజకీయ, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలాంటి నగరంలో సభలు, సమ్మేళనాలు నిర్వహించేందుకు మైదానాలు దొరకడమే కష్టతరంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మైదానాల కొరతవల్ల ముఖ్యంగా రాజకీయ పార్టీలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్ణయంతో శివాజీపార్క్‌లో గతంలో లాగే 30 రోజులు ధార్మిక, సామాజిక కార్యాక్రమాలు, అదనంగా మంజూరైన 15 రోజుల్లో రాజకీయ సభలు నిర్వహించేందుకు అనుమతి లభించనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు క్రీడల శిక్షణకు తగినంత సమయం దొరకదని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు