నారాయణస్వామి ప్రమాణ స్వీకారం

7 Jun, 2016 02:33 IST|Sakshi
నారాయణస్వామి ప్రమాణ స్వీకారం

 సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా కాం గ్రెస్ సీనియర్ నేత నారాయణస్వామి సోమవారం పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ కిరణ్‌బేడీ ఆయనతో ప్రమా ణం చేయించారు. నారాయణస్వామితోపాటూ ఐదుగురు మంత్రులు ప్రమాణం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెల 16వ తేదీన జరిగిన ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్-డీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నారాయణస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎ న్నుకున్నారు. తన ఎన్నిక వివరాలతో కూడిన పత్రాన్ని ఆయన గవర్నర్‌కు అందజే సి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.
 
 అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం
 ఈ సందర్భంగా పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది. బీచ్‌రోడ్డులోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశం ప్రాంగణంలోకి వచ్చిన నారాయణస్వామికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ బరిదా స్వాగతం చె ప్పారు. పుదువై 19వ ముఖ్యమంత్రిగా నారాయణస్వామితో గవర్నర్ కిరణ్‌బేడీ పదవీ ప్రమాణం చేయించారు. భగవంతుని సాక్షిగా అంటూ నారాయణస్వామి ప్రమాణం చేశారు. ఆయనతోపాటూ మంత్రులుగా  నమశివాయం, కందస్వామి, మల్లాడి కృష్ణారావు, షాజహాన్, కమల్‌కన్నన్ ప్రమాణం చేశారు. 12.05కు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.25 గంటలకు ముగిసింది. డీఎంకే కోశాధికారి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్‌వాస్నిక్ తదితరులు పాల్గొన్నారు.
 
 నారాయణుని వరాలు
 పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో నారాయణస్వామి స్వామి మాట్లాడుతూ ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా ఇంతవరకు 10 కిలోల ఉచిత బియ్యాన్ని 20 కిలోలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేగాక ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలపాటూ నిలిపివేసిన 30 కిలోల బియ్యాన్ని కూడా సరఫరా చేస్తామని తెలిపారు. ఆగస్టు నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని అన్నారు. అలాగే విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తామని చెప్పారు. జాలర్లకు పలు రాయితీలను ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు