గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు

1 Jan, 2017 11:46 IST|Sakshi
గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు

హైదరాబాద్‌: అవిభక్త కవలలు వీణావాణీలను నీలోఫర్‌ ఆస్పత్రి నుంచి స్టేట్‌ హోమ్‌ కు తరలించారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీరిని తరలించడం చర్చనీయాంశంగా మారింది. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీణావాణీలను ఆస్పత్రి నుంచి స్టేట్‌ హోమ్‌ కు పంపించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్‌ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్‌ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణ, వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణావాణీలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్‌ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

మరిన్ని వార్తలు