సబ్‌ కలెక్టర్‌ బ్యాంకు ఖాతాలు సీజ్‌!

4 Mar, 2020 08:29 IST|Sakshi
సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌(ఫైల్‌)

వేలూరు: వేలూరులో రూ.50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడిన సబ్‌ కలెక్టర్‌ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసేందుకు ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ పూరీ్వకుల ఆస్తులను తన పేరుపై మార్చుకొని పత్రాలు తీసుకునేందుకు సబ్‌కలెక్టర్‌ దినకరన్‌ సంప్రదించారు. ఆయన రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. వేలూరు ఏసీబీ అధికారులు వలపన్ని సబ్‌కలెక్టర్‌  దినకరన్‌తో పాటు ఆయన డ్రైవర్‌ సురేష్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సుమారు రూ.80 లక్షల నగదు పట్టుపడిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ఆయనకు సహకరిస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. (లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్‌ రాసలీలలు)

వారి వద్ద విచారణ చేపట్టారు. విచారణలో సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడడంతో పాటు పలువురి మహిళలతో రాసలీలలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసి ఏయే బ్యాంకుల్లో ఎంత నగదు ఉంది, ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో దినగరన్‌ పలు కోట్ల రూపాయలను బ్యాంకులో పొదుపు చేయడంతో పాటు అనేక చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. వెంటనే ఆయన బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేసి, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు