విజయ్ సీనియర్ నటుడా?

27 Aug, 2015 03:36 IST|Sakshi
విజయ్ సీనియర్ నటుడా?

 ఇళయదళపతి విజయ్ సీనియర్ నటుడని అన్నదెవరని నటి హన్సిక సీరియస్ అవుతున్నారు. ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. నటి హన్సిక ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌కు జంటగా పులి చిత్రాన్ని పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం సుందర్. సి దర్శకత్వంలో అరణ్మణై-2లో నటిస్తున్నారు. కాగా ఇంతకు ముందు విజయ్ సరసన వేలాయుధం చిత్రంలో నటించారు. ఇప్పుడు మళ్లీ పులి చిత్రంలో నటించారు. ఇలా రెండు సార్లు సీనియర్ నటుడితో నటించే అవకాశం రావడం గురించి ఎలా భావిస్తున్నారన్న ప్రశ్నకు హన్సిక సీరియస్ అయిపోయారు.
 
 అసలు విజయ్‌ను సీనియర్ నటుడని అన్నదెవరు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కోలీవుడ్ నటుల్లో విజయ్‌ను చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. అంతగా నవయువకుడిగా కనిపిస్తారు.ఆయనతో వేలాయుధం చిత్రంలో నటించడం అనిర్వచమైన అనుభవం. పులి చిత్రంలో నటిస్తున్నప్పుడు విజయ్ ఇంకా యువకుడిగా కనిపించారు. మీ యవ్వన రహస్యం ఏమిటని ఆయన్ని చాలా సార్లు అడిగాను అని అన్న హన్సిక విజయ్ ఏమన్నారో చెప్పలేదు. పులి చిత్రంలో ఈ బ్యూటీ యువరాణిగా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటించారు. శ్రీదేవి మహారాణిగా ముఖ్యభూమికను పొషించిన ఈ సోషియో ఫాంటసీ కథా చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు